Begin typing your search above and press return to search.

ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచన లేదు... కానీ ఓటీటీతో కలవబోతున్నారట...!

By:  Tupaki Desk   |   2 May 2020 5:30 AM GMT
ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచన లేదు... కానీ ఓటీటీతో కలవబోతున్నారట...!
X
ప్రస్తుతం తెలుగులోనూ వెబ్ సిరీస్‌ లకు కూడా క్రేజ్ బాగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ హవా నడవబోతున్నదని భావిస్తున్న పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఇప్పటికే డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా డిజిటల్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా'ని క్రియేట్ చేశారు. ఇప్పటికే శరత్ మరార్, స్వప్న దత్, క్రిష్ లాంటి వారు కూడా ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ వైపు అడుగులు వేశారు. కాలక్రమేణా వెబ్ కంటెంట్ కి ప్రాధాన్యత పెరగడంతో వీరితోపాటు చాలా మంది బడా నిర్మాతలు ఇదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు దిల్ రాజు లాంటి వారు కూడా ఆ వైపుగా అడుగులు వేస్తున్నారంటూ రూమర్స్ వచ్చాయి. కానీ వాళ్ళకి ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కూడా ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. బిజినెస్ ప్లాన్స్ లో ప్రస్తుతం ఉన్న ప్రొడ్యూసర్స్ లో సురేష్ బాబుని కొట్టేవారే లేరని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు.. ఏ స్క్రిప్ట్ కు ఎంత బడ్జెట్ పెట్టాలి. సినిమాకి పెట్టిన బడ్జెట్ మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలి అనే విషయంలో మన టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు ఆరి తేరిపోయి ఉన్నారు. ఎంత మంది నిర్మాతలు వచ్చినా ఈయన తన ప్రత్యేకతను చాటుతూనే ఉన్నారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను రిలీజ్ చేసి.. విజయాల్ని సొంతం చేసుకుంటూ వస్తున్నారు సురేష్ బాబు.

ఈ నేపథ్యంలో భవిష్యత్తు అంతా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ దే అని ఈ లాక్ డౌన్ లో అర్థం అయిపోయింది. దీంతో సురేష్ బాబు ఓటీటీ రంగంలోకి దిగుతున్నారంటూ న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే దీనిపై స్పందించిన సురేష్ బాబు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ప్రారంభించే ఆలోచన లేదని స్పష్టం చేసాడట. సురేష్ ప్రొడక్షన్స్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ కోసం వెబ్ కంటెంట్‌ను రూపొందించే ప్రణాళికలో ఉన్నామని.. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చాడట. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ తో బాలీవుడ్ నుండి కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ వంటి బడా ప్రొడ్యూసర్స్ కమ్ డైరెక్టర్స్ టై అప్ అయ్యున్నారు. కానీ మన సౌత్ ఇండస్ట్రీ నుండి ఎవరితో భాగస్వామ్యం పెట్టుకోలేదు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు నిర్ణయంతో నెట్ ఫ్లిక్స్ లో మన తెలుగు కంటెంట్ హవా నడిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.