సమంత మహానటి.. ఒప్పేసుకున్న బడా నిర్మాతలు..!

Sat Dec 03 2022 20:01:50 GMT+0530 (India Standard Time)

suresh babu and allu aravind says samantha is mahanati

ఈ తరం కథానాయికల్లో మహానటి ఎవరు.. ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్న ప్రస్తుతం ఉన్న హీరోలని అడిగితే ఒకవేళ వారికి నచ్చిన హీరోయిన్ పేరు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇదే ప్రశ్నని ఇద్దరు బడా నిర్మాతలని అడిగితే.. దాదాపు యాభై ఏళ్ల సినీ ప్రస్థానం.. నిర్మాతలుగా ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్న ఇద్దరు నిర్మాతలను అడిగితే వాళ్లు చెప్పిన కథానాయిక పేరు ఒక్కటే ఆమే సమంత. ఇంతకీ ఇదెక్కడ జరిగింది అంటే బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఐదవ ఎపిసోడ్ లో నిర్మాతలు సురేష్ బాబు అల్లు అరవింద్ లు పాల్గొన్నారు.ఈ ఎపిసోడ్ లో భాగంగా ఈ తరం నాయికల్లో మహానటి ఎవరు అనే ప్రశ్న వారిని అడిగారు బాలయ్య. దానికి సమాధానంగా ఇద్దరు నిర్మాతలు సమంత పేరు రాయడం జరిగింది. ఏమాయ చేసావే సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన యశోద వరకు సమంత ప్రతి సినిమాలో తన ప్రతిభ చాటుతూ వచ్చింది.

ముఖ్యంగా కెరీర్ లో వెనకపడ్డ ప్రతిసారి డబుల్ ఫోర్స్ తో ఆమె మళ్లీ ఫాం లోకి వచ్చింది. ఈ తరం నాయికల్లో మహానటి అంటే అది తప్పకుండా సమంతనే. ఎన్నో సినిమాలని నిర్మించిన వారి అనుభవంతో ఈ విషయాన్ని పర్ఫెక్ట్ గా చెప్పారు సురేష్ బాబు అల్లు అరవింద్.

సమంత కూడా తన క్రేజ్ కి తగినట్టుగానే ప్రయోగాత్మక సినిమాలతో మెప్పిస్తుంది. రీసెంట్ గా యశోద అంటూ లేడీ ఓరియెంటెడ్ మూవీ తో కూడా సత్తా చాటింది. సినిమాకు టాక్ యావరేజ్ గా వచ్చినా సరే వసూళ్లు అదరగొట్టాయి. ఇప్పటికే యూటర్న్ ఓ బేబీ లాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా హిట్ అందుకున్న సమంత యశోదతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకుంది.

బడా నిర్మాతలు సైతం ఆమెని మహానటి అని ఒప్పుకున్నారు అంటే ఆమె స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అసలైతే సావిత్రికి దగ్గరగా ఉండాలనే ఆలోచనతో కీర్తి సురేష్ ని మహానటిలో నటింప చేశారు కానీ అసలు సమంత ఆ పాత్ర చేసి ఉంటే మరో లెవల్లో ఉండేది. అయినా సరే సమంత ఆ మూవీలో కూడా తన పాత్రలో మెప్పించింది. సమంత చేస్తున్న సినిమాలు అవి అందుకుంటున్న ఫలితాలు రోజు రోజుకి ఆమె ఇమేజ్ ని పెంచుతున్నాయి. పర్సనల్ లైఫ్ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఆన్ స్క్రీన్ మాత్రం సమంత మహానటి అనిపించుకుంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.