సుజిత్ కి బూస్టింగ్ ఇచ్చే కామెంట్ ఇది..!

Mon Dec 05 2022 21:26:21 GMT+0530 (India Standard Time)

sujith reply prabhas tweet

ఈమధ్య మన స్టార్స్ మధ్య వచ్చిన మార్పు పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా సినిమాల మధ్య పోటీ ఉన్నా ఒకే రోజు రిలీజ్ అవుతున్న సినిమాల గురించి కూడా ఒకరి ఫంక్షన్ లో మరొకరు తమ సినిమాతో పాటుగా ఆ రోజు రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు ఆడాలని కోరుతున్నారు. కరోనా తెచ్చిన ఈ కొత్త మార్పు ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఒక హీరో సినిమాకు ఎనౌన్స్ మెంట్ టైం లోనే మరో స్టార్ హీరో విష్ చేయడం అదో పెద్ద సెన్సేషన్. అలా విష్ చేసింది బాహుబలి ప్రభాస్ అయితే.. అది చేసింది కూడా పవర్ హౌస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం.పవన్ లేటెస్ట్ గా సాహో డైరెక్టర్ సుజిత్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. లేటేస్ట్ గా ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ తోనే సర్ ప్రైజ్ చేశారు. ఇక ఎనౌన్స్ మెంట్ రోజే ప్రభాస్ ఈ మూవీపై తన కామెంట్ అభిమానులతో పంచుకున్నాడు. కంగ్రాట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సుజిత్.. ఈ కాంబినేషన్ పెద్ద సంచలనం అవుతుంది. డివివి దానయ్య అండ్ టీం అందరికీ నా బెస్ట్ విషెష్ అని ప్రభాస్ మెసేజ్ చేశారు. దీనికి డైరెక్టర్ సుజిత్ కూడా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

ఒకరికోసం సినిమాల్లోకి వచ్చా.. ఇంకొకరి వల్ల సినిమా తీయగలిగాను.. లవ్ యు బోత్ అంటూ సుజిత్ ఆన్సర్ ఇచ్చాడు. సినిమా ఓపెనింగ్ కే ఈ కాంబో ఎలా ఉండబోతుంది. ఫ్యూచర్ లో ఈ సినిమాకు ఎవరెవరు ఎంత ప్రోత్సాహం అందిస్తారో తెలిసింది. ముఖ్యంగా ప్రభాస్ మెసేజ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి.. డైరెక్టర్ సుజిత్ కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇక పవన్ తో సుజిత్ చేస్తున్నది ఒక గ్యాంగ్ స్టర్ మూవీ అని తెలుస్తుంది. హ్యాష్ ట్యాగ్ ఓజీ అంటూ హింట్ ఇచ్చిన సుజిత్ సాహో తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నా ఇది నిజంగా అతనికి గొప్ప అవకాశమని చెప్పొచ్చు.

పవన్ సినిమా హిట్టు పడితే సుజిత్ కూడా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోతాడు. పవన్ తో సుజిత్ చేస్తున్న సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలతో ఉన్నారు. మరి ఈ పవర్ కాంబో ఎలాంటి పవర్ ఫుల్ మూవీని ప్రేక్షకులకు అందిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.