తెలుగు హీరోలను చెంపదెబ్బ కొట్టినట్లుగా ఆమె జోరు కంటిన్యూ

Fri Feb 14 2020 11:45:47 GMT+0530 (IST)

sudha kongara is in form  as slapping Telugu heroes

టాలీవుడ్ లో లేడీ దర్శకులకు ఆధరణ చాలా తక్కువ అని చెప్పాలి. తెలుగులో విజయ నిర్మల గారి తర్వాత దర్శకురాల్లు సక్సెస్ అయ్యింది చాలా చాలా తక్కువ. ఒకరు ఇద్దరు వచ్చినా కూడా వారికి స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వలేదు. దాంతో చిన్న వారితో రెండు మూడు సినిమాలు చేయడం ఆ తర్వాత కనుమరుగవ్వడం అయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో లేడీ దర్శకురాలు అంటే కేవలం నందిని రెడ్డి పేరు మాత్రమే వినిపిస్తుంది. కాని మన తెలుగు అమ్మాయి అయిన సుధ కొంగర ప్రస్తుతం దర్శకురాలిగా ఓ ఊపు ఊపేస్తోంది. కాని ఇక్కడ కాదు కోలీవుడ్ లో ఆమె జోరు కొనసాగుతుంది.తెలుగులో కమెడియన్ సుమన్ శెట్టితో ఒక సినిమా చేసిన ఈమెను మన స్టార్స్ ఎవరు పట్టించుకోలేదు. దాంతో తమిళంలో అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈమె ట్యాలెంట్ ను గుర్తించిన తమిళ హీరోలు ఛాన్స్ లు ఇచ్చారు. తెలుగులో ఈమె ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వం వహించినా కూడా ఆమె పేరు అసలు బయటకే రాలేదు. తెలుగులో తనకు అవకాశాలు రావు.. గుర్తింపు రావని గుర్తించిన సుధ తమిళనాట బిజీ అయ్యింది.

ప్రస్తుతం తమిళంలో సూర్య హీరోగా ఒక చిత్రాన్ని చేస్తుంది. అక్కడ ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ ఉంది. చాలా కాలంగా సక్సెస్ లేక కొట్టుమిట్టాడుతున్న సూర్యకు ఈమె ఖచ్చితంగా విజయాన్ని ఇస్తుందనే నమ్మకంతో ట్రేడ్ విశ్లేషకులు ఉన్నారు. ఇదే సమయంలో ఈమెకు విజయ్ నుండి కూడా ఛాన్స్ వచ్చిందట.

కోలీవుడ్ సూపర్ స్టార్ అయిన విజయ్ తో ఈమె మూవీ ఇదే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తనకు ఛాన్స్ ఇవ్వని తెలుగు హీరోలకు చెంప దెబ్బ కొట్టినట్లుగా తమిళ సూపర్ స్టార్.. ఆల్ ఇండియా క్రేజ్ ఉన్న విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుంది సుధ. విజయ్ తో మూవీ సక్సెస్ అయిన తర్వాత అయినా మనోళ్లకు మన సుధ ప్రతిభ అర్థం అవుతుందో చూడాలి.