ఫోటో స్టోరీ : స్టైల్ ఐకాన్ మన రామరాజు..!

Sat Dec 03 2022 18:08:26 GMT+0530 (India Standard Time)

style icon ram charan

నటుడిగా తనను తాను మలచుకుంటూ స్టార్ గా తన స్టామినా చూపిస్తూ ఊహించని స్థాయిలో చేరుకున్నాడు మెగా వారసుడు రామ్ చరణ్. రంగస్థలం నుంచి చరణ్ సినిమాలను గమనిస్తే నటుడిగా తన చాలా పరిణితి సాధించాడు. అంతేనా వరుస ఛాలెంజింగ్ పాత్రలతో మెప్పిస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ నటన అదిరిపోయింది. ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ పాత్రలో రెచ్చిపోతే ఆయనకు ఈక్వల్ గా ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇచ్చాడు చరణ్.ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ లో చరణ్ కూడా ఒక మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. ఆ మూవీతో నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉంటున్నాడు చరణ్. లేటెస్ట్ గా ఎన్.డి.టి.వి ట్రూ లెజెండ్ ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డ్ కూడా అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరో రాం చరణ్.

చరణ్ చేస్తున్న సినిమాలే కాదు ఇలాంటి అవార్డులు కూడా మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తున్నాయి. ఇక ఈ ఈవెంట్ కు పాల్గొనేందుకు చరణ్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ తో రాం చరణ్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం చరణ్ ఈ వైట్ అండ్ వైట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం రాం చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. 2023 సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ మూవీ తర్వాత ఉప్పెన బుచ్చి బాబుతో మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధం చేసుకున్నాడు చరణ్.

వరుస పాన్ ఇండియా సినిమాలతో చరణ్ దూసుకెళ్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో నేషనల్ వైడ్ గా భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న రాం చరణ్ ఒకప్పడు జంజీర్ రీమేక్ ని తుఫాన్ అని తీసి బాలీవుడ్ ఆడియన్స్ చేత విమర్శలు అందుకున్నాడు. కానీ అప్పుడు అతన్ని కామెంట్ చేసిన నోళ్లే ఇప్పుడు అవార్డులు ఇచ్చి మెచ్చుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.