పవన్ అంటే క్రష్ అంటున్న వర్మ హీరోయిన్

Wed Jul 08 2020 14:40:13 GMT+0530 (IST)

srirapaka ready to date pawan

ఇండస్ట్రీలో చాలా కాలంగా కాస్ట్యూమ్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న శ్రీరాపా గురించి ఎవరికి పెద్దగా తెలియదు. కాని ఎప్పుడైతే వర్మ ‘నగ్నం’ సినిమాలో ఆమె నటించిందో అప్పటి నుండి ఇండస్ట్రీలో స్టార్ అయ్యింది. ప్రస్తుతం ఈమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడినది. వరుసగా ఈమె ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. వర్మ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది ఇన్నాళ్లు కెరీర్ ఎలా సాగింది. గతంలో రాశిఖన్నాతో జరిగిన గొడవ ఏంటీ ఇలా అనేక విషయాలను చెప్పుకొచ్చిన శ్రీ రాపాక తాజా ఇంటర్వ్యూలో పవన్ పై తనకున్న అభిమానాన్ని చెప్పింది.పవన్ కళ్యాణ్ అంటే క్రష్ అంటూ చెప్పిన శ్రీ ఆయన డేటింగ్ కు పిలిస్తే ఆలోచించకుండా ఓకే చెప్పేస్తానంది. ఇక జీవితంలో ఒక్కసారి అయినా ఆయనతో కలిసి నటించాలనేది నా కోరిక. గతంలో రెండు మూడు సార్లు ఆయన్ను కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నించాను. కాని ఇప్పటి వరకు ఛాన్స్ దక్కలేదు. ప్రస్తుతం ఆయన్ను కలిసేందుకు ఎలాంటి ప్రయత్నాలు అయితే చేయడం లేదు కాని ఏదో ఒక సమయంలో ఆయన్ను కలుస్తానని నమ్మకంగా చెప్పింది.

పవన్ కళ్యాణ్ పై శ్రీ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో హీరోయిన్ ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పెద్దగా పట్టించుకునే వారు కాదు. కాని ఈ వ్యాఖ్యలు చేసింది రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ గా పేరు పొందిన శ్రీ రాపాక అవ్వడంతో చర్చనీయాంశం అయ్యాయి. వర్మ సినిమా తర్వాత మళ్లీ ఏమైనా సినిమాలకు కమిట్ అయ్యారా అంటూ ప్రశ్నించగా ప్రస్తుతానికి చర్చలు మాత్రమే జరుగుతున్నాయని పేర్కొంది.