స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీ కష్టాలు

Sat Aug 06 2022 07:00:02 GMT+0530 (India Standard Time)

sonam kapoor pregnancy difficulties

బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో.. విభిన్నమైన సినిమాల్లో నటించిన సోనమ్ కపూర్ ఇప్పుడు అమ్మ కాబోతున్న విషయం తెల్సిందే.2018 సంవత్సరంలో ఆనంద్ అహుజా ను పెళ్లి చేసుకున్న సోనమ్ కపూర్ పెళ్లి తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్న సమయం లోనే తల్లి కాబోతుంది.  

సోనమ్ కపూర్ తల్లికాబోతున్న నేపథ్యంలో వరుసగా ఫోటో షూట్స్ తో తన బేబీ బంప్ ను చూపిస్తూ వస్తోంది. గర్బవతి అయినప్పటి నుండి తన ప్రతి మూమెంట్ ను కూడా షేర్ చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్ ఇప్పుడు తన కష్టానలు షేర్ చేసింది. చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్లుగా కామెంట్ చేసింది.

ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో అంత నార్మల్ గా ఉండదు అని... తన వాచి పోయిన కాళ్ల ఫోటోలను షేర్ చేసింది. ఎక్కువ సమయం కూర్చుని ఉండటం.. విశ్రాంతి తీసుకుని ఉండటం వల్ల ఇలా కాళ్లు వాచాయి అంటూ ఆమె పేర్కొంది. త్వరలోనే సోనమ్ కపూర్ బేబీ బాయ్ లేదా గర్ల్ కి జన్మనివ్వబోతుంది.

తల్లికాబోతున్న సమయంలో ఇలాంటివి కామన్ విషయాలే అయినా కూడా హీరోయిన్ అవ్వడం వల్ల సోనమ్ కపూర్ పై చాలా మంది అయ్యో అంటూ సానుభూతి చూపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.