లేడీ డైరెక్టర్ తో డీజే టిల్లు

Wed Feb 08 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

siddhu jonnalagadda with lady director Vaishnavi

డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా యూత్ లో పాపులారిటీని సొంతం చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే డీజే టిల్లు సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఒక వైపు డీజే టిల్లు సీక్వెల్ కు వర్క్ చేస్తూనే మరో వైపు సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లేడీ డైరెక్టర్ వైష్ణవి ఈ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈమె సుకుమార్ శిష్య బృందంకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సుకుమార్ శిష్యురాలు అవ్వడం వల్లే ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్ లో నిర్మించబోతున్నాడు. సిద్దు 8వ సినిమాగా ఈ సినిమా రూపొందబోతుంది.

కథ నుండి ఎడిటింగ్ వరకు అన్ని వ్యవహారాల్లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉండేలా సిద్దు జొన్నలగడ్డ చూసుకుంటాడు. సిద్దుకు తోడు వైష్ణవి కాస్త క్రియేటివ్ గా సినిమా ను చేస్తే కచ్చితంగా మరో డీజే టిల్లు వంటి సినిమా రావడం ఖాయం.

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిద్దు జొన్నలగడ్డ కాస్త స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త పడితే హిట్ ఖాయం. స్క్రిప్ట్ వర్క్ లో సుకుమార్ హ్యాండ్ కూడా ఉండే అవకాశం ఉంది. కనుక సిద్దు 8 తప్పకుండా మంచి సినిమాగా నిలుస్తుందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.