Begin typing your search above and press return to search.

#TREND శిల్పా శెట్టి న్యూ హెయిర్ స్టైల్

By:  Tupaki Desk   |   24 Oct 2021 1:30 PM GMT
#TREND శిల్పా శెట్టి  న్యూ హెయిర్ స్టైల్
X
నిత్యం ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కించే శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో చిక్కుకోవ‌డంతో శిల్ప ఒక్క‌సారిగా గంద‌ర‌గోళా నికి గురైన సంగ‌తి తెలిసిందే. భ‌ర్త‌ను బెయిల్ పై బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నించి చివ‌రికి ఎలాగూ సాధించారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ‌ల నుంచి కోలుకుంటోంది. ఈ నేప‌థ్యంలో శిల్పాశెట్టి మ‌ళ్లీ ఇన్ స్టా ని వేడెక్కించ‌డం మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోం ది. భ‌ర్త జైల్లో ఉన్నంత కాలం జీవితం లో చీక‌టి కోణాల గురించి ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టిన శిల్ప మ‌ళ్లీ ఓల్డ్ మూవ్ మెంట్స్ ని షురూ చేసిన‌ట్లే క‌నిపిస్తోంది. శిల్పా శెట్టి తాజాగా తన న్యూ హెయిర్ స్టైల్ కి చెందిన ఓ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

ఇందులో వెన‌క భాగంలో జుత్తు మొత్తం ట్రిమ్ చేసింది. బూడిద‌రంగు టాప్ .. ట్రాక్ ధ‌రించి వ‌ర్కౌట్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. జీవితంలో రిస్క్ తీసుకుంటేనే ఏదైనా సాధించవ‌చ్చు.రిస్క్ తీసుకుంటే ర‌స్క్ దొరుకుతుంది. కంప‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి జీవించ‌డం నేర్చుకోండి అంటూ సూచించింది. మ‌రి ఈ పోస్ట్ ఎవ‌ర్ని ఉద్దేశించి పెట్టిన‌ట్లు! కామ‌న్ పీపూల్స్ ని ఉద్దేశించి సెల‌బ్రిటీలు ఇలా స్పందించ‌రు. వ్య‌క్త‌గ‌తంగా ఎవ‌రికైనా కౌంట‌ర్లు వేయాలంటేనే! ఇలాంటి కామెంట్లు ప‌డ‌తాయంటూ నెటి జ‌నులు కామెంట్లు చేస్తున్నారు. భ‌ర్త జైలు లో ఉన్న‌ప్పుడు కూడా శిల్పాశెట్టి ఇలాంటి కొన్ని కామెంట్లు చేసింది. స్టిల్ అవే కొన‌సాగిస్తుంది.

న్యూ హెయిర్ స్టైల్ ని అడ్డుపెట్టుకుని కామెంట్లు విస‌రడం ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర సంగ‌తి. ఆ న్యూ హెయిర్ స్టైల్ కూడా ఎవ‌రికైనా కౌంట‌ర్ గానే దించిందా? అన్న సందేహాలు నెటి జ‌నులు వ్య‌క్తం చేస్తున్నారు. హీరోయిన్లు ఎవ‌రు ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఇప్ప‌టివ‌రకూ నిజ జీవితం లో ప్ర‌య‌త్నించ‌లేదు. ప్రోఫెష‌న‌ల్ గా పాత్ర డిమాండ్ మేర‌కు హీరోయిన్లు ఇలా హెయిర్ క‌త్తిరించుకోవ డం చూసాం గానీ అన్ ప్రోఫెష‌న‌ల్ గా హెయిర్ తో ఇలాంటి సాహ‌సాలు చేసింది ఎవ‌రూ లేరు సుమీ.