Begin typing your search above and press return to search.

HIT-3 లో సీరియల్ కిల్లర్‌గా అమ్మాయే ఉండాలి.. స్పందించిన శేష్!

By:  Tupaki Desk   |   3 Dec 2022 11:30 AM GMT
HIT-3 లో సీరియల్ కిల్లర్‌గా అమ్మాయే ఉండాలి.. స్పందించిన శేష్!
X
అడ‌వి శేషు హీరోగా నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన 'హిట్-2' పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న‌సంగ‌తి తెలిసిందే. సినిమాకి రివ్యూల‌న్నీ పాజిటివ్ గానే వ‌చ్చాయి. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యం మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌య ఢంకా మోగించింది. రిలీజ్ కి ముందు సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. మొద‌టి భాగం పెద్ద విజ‌యం సాధించ‌డం తో హిట్ -2 పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోయాయి.

వాటిని శేష్- నానిలు ఎంత వ‌ర‌కూ నిజం చేస్తారు? అని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ లో ఉత్కంఠ కొన‌సాగేది. ఎట్టకేల‌కు వాటిని ఆ ద్వ‌యం నిజం చేసింది. సినిమా ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. సంక్రాంతి పండుగ ముందు హిట్ -2 రూపంలో మ‌రో విజ‌యం టాలీవుడ్ ఖాతాలో ప‌డిన‌ట్లే. ఈ నేప‌థ్యంలో అప్పుడే హిట్-3 ఎప్పుడంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం మొద‌లైంది.

తొంద‌ర‌గా పూర్తిచేసి రిలీజ్ చేయండి నాని గారు అంటూ నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అలాగే స్ర్కిప్ట్ కి సంబంధించి అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు..స‌ల‌హాలుకూడా ఇచ్చేస్తున్నారు. సినిమాలో శేష్ సీరియ‌ల్ కిల్ల‌ర్ ని ప‌ట్టుకునే పోలీస్ అధికారి పాత్ర‌లో న‌టించారు. ఇందులో ఒక అమ్మాయిని చంపింది సీరియ‌ల్ కిల్ల‌ర్ అబ్బాయి. దీనికి ఓయువ‌తి స్పందిస్తూ నాని గారు హిట్ =3 లో సీరియ‌ల్ కిల్ల‌ర్ గా అమ్మాయిని పెట్టండి ని పోస్ట్ చేసింది.

లేదంటే నేనే ఆ మ‌హేష్ గాడిని చంపేస్తాన‌ని రాసుకొచ్చింది. దీనికి శేషు స్పందిస్తూ...ఈ లేడీ చంపినా చంపేస్తుంది. కానీ థియేట‌ర్ లో హిట్-2 మాత్రం మిస్ అవ్వ‌కండి' అంటూ బధులిచ్చారు. ఆ యువ‌తి స‌ల‌హా కూడా బాగానే ఉంది.

సీరియ‌ల్ కిల్ల‌ర్ పాత్ర‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కూ చాలా సినిమాల్లో అబ్బాయిల్నే చూపించారు. అమ్మాయి పాత్ర‌ల్ని చాలా త‌క్కువ‌గానే చూపించారు. అందులోనూ తెలుగులో ఇలాంటి సినిమాలు రానే లేదు. కాబ‌ట్టి ఆ యువ‌తి హిట్ -3 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ స‌ల‌హానే ఇచ్చింద‌నొచ్చు. మ‌రి నాని...శేష్.శైలేష్ కొల‌ను ఏమంటారో? చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.