Begin typing your search above and press return to search.

పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై మళ్ళీ నీలి నీడలు..!

By:  Tupaki Desk   |   10 Jun 2021 4:30 AM GMT
పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై మళ్ళీ నీలి నీడలు..!
X
పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ - ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్ లో ఓ పాన్ వరల్డ్ మూవీకి అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత అశ్వినీ దత్ రెడీ అయ్యారు. స్టార్ క్యాస్టింగ్ తో రూపొందించాలని ఫిక్స్ అయిన మేకర్స్, ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ను సెలెక్ట్ చేసుకున్నారు. అలానే కీలక పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ని తీసుకున్నారు. మెంటర్ గా లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ వర్క్ చేస్తారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియ‌ని ప‌రిస్థితి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని '#Prabhas21' ప్రాజెక్ట్ అంటూ అనౌన్స్ చేసారు. అయితే హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించాల్సిన సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. దీంతో నాగ్ అశ్విన్ సినిమా ఆర్డర్ మారడమే కాకుండా.. ప్రభాస్ సినిమాల జాబితాలో చివరకు వెళ్ళిపోయింది. ఈ జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు నాగ్‌ అశ్విన్‌ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ వచ్చి అన్నీ ప్లాన్స్ తారుమారు చేసింది.

ప్ర‌భాస్ నుంచి బల్క్ డేట్స్ తీసుకొని ఈ చిత్రాన్ని ప్రారంభించాలని నాగ అశ్విన్ ప్లాన్ చేసుకున్నారు. అయితే డార్లింగ్ ఆల్రేడీ ఇచ్చేసిన క‌మిట్మెంట్స్ త‌రువాత కానీ నాగ అశ్విన్ కు డేట్స్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2022 స‌మ్మ‌ర్ నాటికి 'సలార్' 'ఆది పురుష్' సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకొని.. నాగ్ అశ్విన్ సినిమాలో జాయిన్ అవుదామ‌ని ప్రభాస్ భావించారు. అయితే ఇప్పుడు లెక్క‌లన్నీ మారాయి. క‌రోనా కార‌ణంగా ప్ర‌భాస్ చేస్తున్న సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి.. ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఈ మధ్యలో మరో స్టార్ డైరెక్టర్ ఎవరైనా సాలిడ్ స్క్రిప్ట్ తో వస్తే ప్రభాస్ అటు వైపు ఆలోచించే అవకాశాలు లేకపోలేదు. ఇదే కనుక జరిగితే నాగ్ అశ్విన్ ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఇంకాస్త వెనక్కు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.