సర్కారు వారి పాట ఆడియో అలర్ట్

Tue Jan 25 2022 11:10:52 GMT+0530 (IST)

sarkaru vaari paata song audio alert?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ క్రేజీ మూవీ 'సర్కారు వారి పాట' షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. కరోనా వరుస వేవ్ ల వల్ల బ్రేక్ లు పడుతూ వస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ కు తాజాగా మహేష్ బాబుకు కరోనా సోకడం వల్ల బ్రేక్ పడింది. వచ్చే నెల ఆరంభం నుండి షూటింగ్ ను పునః ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేదు కనుక బ్యాక్ టు బ్యాక్ పాటలను కూడా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

సర్కారు వారి పాట మొదటి పాటను ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. ఆ విషయాన్ని రిపబ్లిక్ డే అయిన రేపు ప్రకటించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన హడావుడి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ అయితే లేదు కాని అభిమానులు ఖచ్చితంగా రిపబ్లిక్ డే సందర్బంగా పాట విడుదల తేదీని ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి.

 మహేష్ బాబు తన ప్రతి సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ను రిపబ్లిక్ డే సందర్బంగా గత కొన్నాళ్లుగా ఇస్తూ వస్తున్నారు. కనుక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్బంగా కూడా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు.

మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ల కాంబోలో వచ్చే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ ట్రాక్ ను ప్రేమికుల రోజు విడుదల చేసేందుకు గాను థమన్ సిద్దం చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈమద్య కాలంలో థమన్ వాయింపు ఓ రేంజ్ లో ఉంటుంది. ఆయన నుండి వచ్చిన ప్రతి ఒక్క పాట కూడా మ్యూజికల్ గా సూపర్ హిట్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఆయన స్టార్ హీరోల సినిమాలకు ఇచ్చే పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. కనుక సర్కారు వారి పాట సినిమాకు కూడా ఆయన ఇచ్చిన ఆడియో సినిమా సూపర్ హిట్ లో కీలక పాత్ర పోషిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారట. పాటల విడుదల మొదలు అయితే సర్కారు వారి పాట సినిమా గురించి మీడియాలో మారు మ్రోగుతూనే ఉంటుంది. కనుక సినిమా విడుదల కూడా సమ్మర్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.