Begin typing your search above and press return to search.

చేయని నేరానికి ఇంట్లో కూర్చోలేక.. విడాకుల‌పై సామ్ వ్యాఖ్య‌

By:  Tupaki Desk   |   29 March 2023 3:00 PM GMT
చేయని నేరానికి ఇంట్లో కూర్చోలేక.. విడాకుల‌పై సామ్ వ్యాఖ్య‌
X
టాలీవుడ్ లో అగ్ర కథానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ను ఆస్వాధిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే నాగ‌చైత‌న్య‌తో వైవాహిక బంధం వైఫ‌ల్యంపై తాజాగా స‌మంత ఘాటైన వ్యాఖ్య చేసారు. పెళ్లి అనే బంధంలో తాను వంద శాతం నిజాయతీగా ఉన్నానని.. కానీ అది వర్కౌట్‌ కాలేదని అన్నారు. ఏప్రిల్ 14న‌ `శాకుంతలం` విడుద‌ల సంద‌ర్భంగా ప్ర‌ముఖ ప‌త్రిక‌తో మాట్లాడుతూ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పైవిధంగా వ్యాఖ్యానించారు.

పుష్ప లో ఐటెమ్‌ సాంగ్‌ చేయడంపైనా స‌మంత త‌న‌దైన వివ‌ర‌ణ ఇచ్చారు. నిజానికి బ్రేక‌ప్ అయిన కొన్నాళ్ల‌కే పుష్ప లో `ఊ అంటావా..` సాంగ్ లో న‌ర్తించే అవ‌కాశం వ‌చ్చింది. వెంట‌నే ఓకే చేసాను. చేయ‌ని నేరానికి చేయ‌ని త‌ప్పున‌కు బాధ‌ప‌డుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలి? అనుకున్నాను. కానీ ఆ పాట‌ను ప్ర‌క‌టించ‌గానే కుటుంబ స‌భ్యులు తెలిసిన వాళ్లు స్నేహితులు ఫోన్లు చేసి ``ఇంట్లో కూర్చో చాలు...విడాకుల త‌ర్వాత వెంటనే నువ్వు ఐటెమ్‌ సాంగ్స్‌ చేయడం బాగోదు` అని సలహాలు ఇచ్చారు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే స్నేహితులు కూడా ఇది చేయొద్దనే అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ పాట‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసాను అని తెలిపారు.

అందరినీ కాద‌ని అలా చేయ‌డానికి కార‌ణం.. వైవాహిక బంధంలో నేను 100శాతం నిజాయతీగా ఉన్నాను. కాకపోతే అది వర్కౌట్‌ కాలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కోవాలి? నేను చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని ఎందుకు బాధపడాలి? అంటూ ప్ర‌శ్నించారు స‌మంత‌.

ఎన్నో బాధ‌లు అనుభ‌వించాను. న‌టిగా ప‌ర్ఫెక్ష‌న్ కావాల‌ని అందంగా క‌నిపించాల‌ని శ్ర‌మించాను. మ‌యోసైటిస్ నా జీవితంలో ప్ర‌వేశించి చాలా ఇబ్బంది పెట్టింది. మెడికేష‌న్ కార‌ణంగా నాపై నాకే కంట్రోల్ లేని ప‌రిస్థితి. కొన్నిసార్లు నీర‌సంగా.. మ‌రికొన్నిసార్లు బొద్దుగా.. క‌నిపించొచ్చు. వెలుతురును నా క‌ళ్లు త‌ట్టుకోలేవు. క‌ళ్ల‌జోడు పెట్టుకుని వెళితే ఎవ‌రైనా ఏమైనా అనుకోవ‌చ్చు. కానీ ఇప్పుడు అది ప‌ట్టించుకోలేను.

క‌ళ్ల‌తోనే కోటి భావాలు ప‌లికించాలి. కానీ నాకు ఈ ప‌రిస్థితి వ‌చ్చింది అని ఆవేద‌న‌ను స‌మంత వ్య‌క్తం చేసారు. ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి వేరొక న‌టికి రాకూడ‌ద‌ని అన్నారు. ఎనిమిది నెల‌లుగా పోరాడుతున్నాను. అన్నిటినీ భ‌రిస్తూ వ‌చ్చాను. బాధ‌ను అన‌నుభ‌విస్తూనే ఉన్నాను.. అన్నిటినీ దాటుకుని ముందుకు సాగుతాను అని ఆత్మ‌విశ్వాసాన్ని క‌న‌బ‌రిచారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.