జెర్సీ హీరోయిన్ కు హీట్ తగిలిందే!

Mon Apr 15 2019 22:30:38 GMT+0530 (IST)

samantha Fans Fires on Shraddha Srinath

ఏమీ లేని దానికే ఇక్కడ చాలామంది మనోభావాలు దెబ్బ తింటుంటాయి.  ఇక ఏదైనా నిజంగా విమర్శలాంటిది ఉంటే ఊరుకుంటారా? సెలబ్రిటీలు ఎప్పుడైనా మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా అంటే గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా.  అదేంటి.. అయన అస్స..లు మాట్లాడడు కదా అని మీరు అనుమానం వ్యక్తం చేస్తారేమో. దాన్నేకదా జాగ్రత్త అనేది.  కానీ ఈ గురూజీ టెక్నిక్ కన్నడ హీరోయిన్.. జెర్సీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న శ్రద్ధ శ్రీనాథ్ కు తెలిసినట్టుగా లేదు. అందుకే రీసెంట్ గా ఒక విషయంలో క్యాజువల్ వా మాట్లాడేసింది. దీంతో సమంతా అభిమానులు హార్ట్ అయ్యారట.ఇంతకీ ఏం జరిగిందంటే సమంతా తెలుగులో చేసిన 'యూ టర్న్' సినిమాకు కన్నడ ఒరిజినల్ లో హీరోయిన్ శ్రద్ధ  శ్రీనాథ్.  రీసెంట్ గా 'జెర్సీ' ప్రమోషన్స్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంతా నటించిన 'యూ టర్న్' చిత్రాన్ని అరగంట కంటే ఎక్కువసేపు చూడలేకపోయానని క్యాజువల్ గా చెప్పేసింది. మరి దానికి కారణం ఏంటంటే తను చాలా పొసెసివ్ అంట.  అందుకే తను నటించిన పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోయానని ఓపెన్ గా చెప్పేసింది. అసలే సామ్ సౌత్ లోనే టాప్ హీరోయిన్. భారీ అభిమానగణం కూడా ఉండే నటి కావడంతో ఆ అభిమానుల్లో కొంతమంది అప్సెట్ అయ్యారట. ఒక సీనియర్ హీరోయిన్ గురించి శ్రద్ధ పుసుక్కున అలా ఎలా అనేసింది.. మేము హర్ట్ అయ్యాం అని.. వారు అంటున్నారట.

మరి శ్రద్ధ ఏ ఉద్దేశంతో అలా అందో తెలియదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.  లౌక్యం తక్కువ అయినా అయి ఉండాలి లేకపోతే.. మన జనాలగురించి ఇంకా తెలిసి ఉండకపోవచ్చు. మన జనాలు ఏం వివాదం లేకపోతేనే కోడి గుడ్లను డజన్ల కొద్ది కొనుక్కొచ్చి ఈకలు పీకే రకం. మరి ఇలా ఒక స్టార్ హీరోయిన్ పై కామెంట్ చేస్తే హీట్ తగలకుండా ఎలా ఉంటుంది? మరి ఈ విషయం పై శ్రద్ధ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.