Begin typing your search above and press return to search.

సూపర్ హిట్‌ 'టైగర్‌' మరోటి రెడీ అయ్యిందట

By:  Tupaki Desk   |   14 Oct 2021 6:36 AM GMT
సూపర్ హిట్‌ టైగర్‌ మరోటి రెడీ అయ్యిందట
X
బాలీవుడ్ లో ఈమద్య ఫ్రాంఛైజ్ సినిమాలు అధికంగా వస్తున్నాయి. ఒక్క సినిమా సక్సెస్‌ అయితే దానికి సీక్వెల్‌ లేదా.. దాని ప్రీక్వెల్స్ వంటివి వస్తూనే ఉన్నాయి. ఆ టైటిల్ తో సినిమా రావడం వల్ల అప్పటికే సక్సెస్‌ అయిన సినిమా కనుక ఖచ్చితంగా జనాల ఆధరణ లభిస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు అలా వచ్చాయి.. మరి కొన్ని విడుదలకు సిద్దం అవుతున్నాయి.. కొన్ని షూటింగ్‌ దశలో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కెరీర్ లో బిగ్గెస్ట్‌ సక్సెస్ సినిమాల జాబితాలో టైగర్ ఒకటి ఉంటుంది అనడంలో సందేహం లేదు. టైగర్ హిట్ తో టైగర్ జిందా హై కూడా వచ్చింది. ఆ రెండు కూడా సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్‌ సక్సెస్ లుగా నిలిచాయి అనడంలో సందేహం లేదు.

యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ బ్యానర్ లో రూపొందిన ఆ సినిమాల ప్రాంచైజ్ లో మూడవ సినిమా పట్టాలెక్కింది. గత ఏడాదిలోనే ఈ సినిమాను పట్టాలెక్కించినా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే నెలలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ ను వచ్చే నెల పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. మనీష్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సల్మాన్ అభిమానుల అభిరుచికి తగ్గట్లుగా.. వారు ఏం కోరుకుంటున్నారో అదే చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

టైగర్ మూడవ ప్రాంచైజ్ మూవీలో సల్మాన్ ఖాన్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌ నటిస్తోంది. వీరిద్దరి కాంబో ఇప్పటికే మంచి సక్సెస్ లను దక్కించుకున్నాయి. అందుకే వీరిద్దరు ఖచ్చితంగా మరో విజయాన్ని టైగర్ తో దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. ఈ సినిమాలో మరోసారి సల్మాన్‌ మరియు కత్రీనాల రొమాన్స్ పీక్స్‌ లో ఉంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సల్మాన్‌ వచ్చే ఏడాది వరుసగా మూడు నాలుగు సినిమాలను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో ఈ మూడవ టైగర్‌ ఒకటిగా ఉంటుందట.