#డైలమా.. పోటీ వద్దనుకునే `సాలార్` వెనక్కి..!

Mon Mar 01 2021 10:25:15 GMT+0530 (IST)

salaar release date Fixed

పవన్ కల్యాణ్ నటిస్తున్న PSPK27 సంక్రాంతి కానుకగా జనవరి 2020లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. నిజానికి సంక్రాంతి బరిలో సలార్ ని రిలీజ్ కి సిద్ధం చేయాలని దర్శకనిర్మాతలు ప్రశాంత్ నీల్- కిరంగదూర్ భావించారు. కానీ అనూహ్యంగా పవన్ కల్యాణ్ - క్రిష్ బృందం సంక్రాంతిని లాక్ చేశామని ప్రకటించడం బిగ్ షాక్ కి గురి చేసిందట.ఆ తర్వాత రకరకాల అనూహ్య పరిణామాల అనంతరం సలార్ చిత్రబృందం సస్పెన్స్ ని మెయింటెయిన్ చేస్తూ తమ రిలీజ్ తేదీని సమ్మర్ కి మార్చడం ప్రభాస్- పవన్ ఇరువురి అభిమానుల్లో చర్చనీయాంశమైంది. రెండు పెద్ద రిలీజ్ లు ఒకే సమయంలో ఉండకూడదని భావించి ప్రశాంత్ నీల్- హోంబలే బృందం ఈ  నిర్ణయం తీసుకుందా? అంటూ ముచ్చట స్టార్టయ్యింది.

ఇదంతా ఆకస్మికం. సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నామని పీఎస్ పీకే బృందం ట్రేడ్ కి సమాచారం ఇచ్చిన తర్వాత టైటిల్ పోస్టర్ లాంచ్ ని మార్చి 11న మహాశివరాత్రి కానుకగా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సలార్ బృందం నిర్ణయం మార్చుకుని సమ్మర్ కి వెళ్లిందట.

నిజానికి సంక్రాంతి బరిలో పవన్ వస్తున్నాడని తెలిశాక ఫిబ్రవరి 28వ తేదీకి సలార్ ని రిలీజ్ చేయాలని భావించారు. సంక్రాంతికే అనుకున్నా పోటీ వద్దనుకునే అలా భావించారు. కానీ ఆ తర్వాత కూడా రకరకాల డైలమాల నడుమ సమ్మర్ కానుకగా ఏప్రిల్ కి సలార్ బృందం వెళ్లారని తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాట సంక్రాంతి 2022 కానుకగా రిలీజ్ కి వస్తుండగా.. పవన్ కూడా పోటీపడుతున్నారు.