హాలీవుడ్ లో సలార్ మూవీ

Tue Mar 21 2023 07:00:02 GMT+0530 (India Standard Time)

salaar movie releases in hollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో ఉండబోతుంది అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు పృధ్వీ రాజ్ సుకుమరన్ విలన్స్ గా నటిస్తూ ఉండగా శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.గ్యాంగ్ స్టార్ కథాంశంగా ఈ మూవీ ఉండబోతుంది అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఇండియన్ భాషలన్నింటిలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కనీసం 11 భాషలలో డబ్బింగ్ చేసిన రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచనగా ఉంది. ఈ మూవీ ద్వారా మరో సరి వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కేజీఎఫ్ సిరీస్ కి మించి ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ని ప్రశాంత్ నీల్ డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాని భారతీయ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకి రీచ్ చేయడం కోసం ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ నిర్మాత విజయ్ కిరంగదూర్ భావిస్తున్నారని టాక్. ఇక ఆంగ్లంలో ఈ మూవీని పెర్ఫెక్ట్ గా డబ్బింగ్ చేయించి హాలీవుడ్ ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్. దీనికోసం ప్రొఫెషనల్ ఇంగ్లీష్ ఆర్టిస్ట్స్ ని డబ్బింగ్ కోసం తీసుకుంటున్నారని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ కె మూవీని ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేయాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సలార్ కూడా ఇంగ్లీష్ లో వస్తే కచ్చితంగా ఇండియన్ హాలీవుడ్ మూవీస్ గా ఈ రెండు మారుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.