ఎన్టీఆర్30 ఓపెనింగ్ కోసం లంకేష్...!

Fri Mar 17 2023 08:00:02 GMT+0530 (India Standard Time)

saif ali khan for the opening of NTR30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే వారంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయనే వార్తలు వస్తున్నాయి. పూజా కార్యక్రమాలకు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పాల్గొంటాడనే వార్తలు జోరుగా వస్తున్నాయి.



బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల్లో నటించడం కామన్ అయ్యింది. సంజయ్ దత్ తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ తెలుగు.. తమిళ.. కన్నడ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో లంకేష్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెల్సిందే.

ఎన్టీఆర్ 30 సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు గత కొన్నాళ్లుగా వస్తున్నాయి. ఆ వార్తలకు సినిమా పూజా కార్యక్రమాలకు సైఫ్ అలీ ఖాన్ పాల్గొనడంతో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ సైఫ్ అలీ ఖాన్ ను ఈ సినిమాలో నటింపజేసినట్లుగా తెలుస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ 30 ని విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ను ఎన్టీఆర్ కు జోడీగా నటింపజేస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ను కూడా సినిమాలో నటింపజేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబోలో గతంలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో నిలవలేక పోయింది. ఆ లోటును ఎన్టీఆర్ 30 తీర్చుతుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కొరటాల శివ గత చిత్రం ఫలితం కారణంగా స్క్రిప్ట్ వర్క్ కు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను కొరటాల శివ రూపొందించాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.