పాన్ ఇండియా డైరెక్టర్ పెళ్లి ఇంత సింపుల్ గా ఏంటో?

Mon Aug 03 2020 11:45:10 GMT+0530 (IST)

saaho director sujeeth ties the knot

ప్రభాస్ తో ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించి పాన్ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్న దర్శకుడు సుజీత్. ముఖ్యంగా బాలీవుడ్ లో సుజీత్ గురించి బాగానే చర్చ జరిగింది. అక్కడ నుండి ఒకటి రెండు ఆఫర్లు కూడా వచ్చినట్లుగా ఆమద్య ప్రచారం జరిగింది. అంతటి స్టార్ డం క్రేజ్ ను కలిగి ఉన్న సుజీత్ తన పెళ్లిని చాలా సింపుల్ గా ఒక సిక్రెట్ మ్యారేజ్ లా పూర్తి చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. కరోనా కారణంగా హడావుడి చేయలేదు అని చెబుతున్నా దీని వెనుక మరేదైనా కారణం ఉందా అంటూ కొందరు నెటిజన్స్ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.సుజీత్ పెళ్లి నిన్న రాత్రి గోల్కొండ రిసార్ట్స్ లో చాలా సింపుల్ గా పూర్తి అయ్యింది. ఈ పెళ్లికి కనీసం ప్రభాస్ కాని ఆయన మొదటి సినిమా హీరో శర్వానంద్ కాని యూవీ క్రియేషన్స్ వారు కాని ఎవరు హాజరు కాలేదు. సుజీత్ పిలవాలే కాని చాలా మందే హాజరు అయ్యే వారు. కాని ఆయన తన పెళ్లి విషయంలో ఇంకా సస్పెన్స్ ను మెయింటెన్ చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన పెళ్లికి సంబంధించిన ప్రకటనను సుజీత్ చేయలేదు. ఎంగేజ్ మెంట్ విషయమై ఇంతకు ముందు క్లారిటీ ఇచ్చిన సుజీత్ పెళ్లి డేట్ చెప్పకుండానే హఠాత్తుగా పెళ్లి పీఠలు ఎక్కడంపై చర్చ జరుగుతోంది.

ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే లూసీఫర్ రీమేక్ కోసం దాదాపుగా మూడు నాలుగు నెలలు కష్టపడ్డాడు. అయితే స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేయడంతో గోపీచంద్ తో సినిమాకు సుజీత్ రెడీ అయ్యాడంటూ సమాచారం అందుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ సుజీత్ గోపీచంద్ మూవీ తెరకెక్కబోతుంది. ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.