Begin typing your search above and press return to search.

అర్నబ్ విషయంలో ఆర్జీవీ తప్పులో కాలేసాడా...?

By:  Tupaki Desk   |   4 Aug 2020 6:15 AM GMT
అర్నబ్ విషయంలో ఆర్జీవీ తప్పులో కాలేసాడా...?
X
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేను ఏది చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తాను అని బాహాటంగా వెల్లడించారు. ఈ క్రమంలో ఏదైనా ఇష్యూపైన లేదా కొంతమందిని వ్యక్తులనైనా టార్గెట్ చేసుకొని కామెంట్స్ చేయడమో ట్వీట్స్ చేయడమో చేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్లి వారిని టార్గెట్ చేస్తూ సినిమా తీసి సంచలనం రేపుతాడు. ఇలా ప్రతి దాంట్లో కావాల్సినంత పబ్లిసిటీ రాబట్టుకుంటూనే ఉంటారు వర్మ. ఈ నేపథ్యంలో కొంతమందిని టార్గెట్ చేస్తూ ''అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'' ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' ''పవర్ స్టార్'' వంటి సినిమాలు తీసి అతనికి అవసరమైన పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. యావత్ భారతదేశానికి షాకిచ్చిన ఓ ఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా అంటూ ''మర్డర్'' అనే రిలీజ్ కి రెడీ చేసారు. ఇది మిర్యాలగూడ మారుతీరావు - అమృత - ప్రణయ్ విషాధగాధను బేస్ చేసుకొని రూపొందిస్తున్నాడు.

కాగా 'మర్డర్' సినిమాకి ఇప్పటికే ప్రచారం చేసుకున్న వర్మ ''అల్లు'' అనే ఫిక్షనల్ రియాలిటీ మూవీ అనౌన్స్ చేసి అల్లు అరవింద్ పై రాళ్లు వేయబోతున్నాడు. ఆ సినిమా ఎవరిని టార్గెట్ చేస్తూ తీస్తున్నారో వర్మ చెప్పనప్పటికీ అల్లు అరవింద్ పై తీస్తున్నదే అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ క్రమంలో లేటెస్టుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు ఎంచుకున్నాడు వర్మ. అయితే ఈసారి ఆ కేసుని డైరెక్టుగా పబ్లిసిటీ కోసం తీసుకోకుండా ఆ కేసుపై వరుస స్టోరీస్ టెలికాస్ట్ చేస్తూ డిబేట్స్ పెడుతున్న రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామిని సెలెక్ట్ చేసుకున్నారు. అర్నబ్ గోస్వామి బాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నాడని.. అతనిపై ''అర్నబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్'' అనే సినిమా తీస్తున్నానని ప్రకటించారు. అయితే అన్ని విషయాల్లో పక్కా ప్లాన్ తో ముందుకెళ్లే ఆర్జీవీ ఈ విషయంలో మాత్రం తప్పులో కాలేసాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అర్నబ్ గోస్వామి కూడా తనలాంటి వ్యక్తే అనే విషయం రామ్ గోపాల్ వర్మ ఆలోచించలేదు. అర్నబ్ కూడా అన్ని విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ పబ్లిసిటీ తెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలోనే సుశాంత్ కేసుపై డిబేట్స్ పెడుతూ మద్ధతు కూడగట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ ప్రజలు సుశాంత్ సూసైడ్ కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. అతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అర్నబ్ ఉద్దేశ్యం ఏదైనప్పటికీ అన్ని వర్గాల ప్రజల నుండి ఈ ఇష్యూలో అతనికి సపోర్ట్ లభిస్తున్నది. అయితే ఇప్పుడు అనవసరంగా అర్నబ్ గోస్వామిని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేయడం.. మూవీ అనౌన్స్ చేయడం పబ్లిసిటీ స్ట్రాటజీలా అనిపించడం లేదు. ప్రజల సపోర్ట్ అతనికి ఉన్నప్పుడు వర్మ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసి లాభం లేదని అంటున్నారు. అందువల్ల ''పవర్ స్టార్'' ''అల్లు'' సినిమాలకి వచ్చిన మద్ధతు ఈ 'అర్నబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్'కి రాకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.