వీడియో: ఇది చూశాక రీటేక్ అడిగే డైరెక్టరుంటాడా?

Sat Oct 23 2021 16:00:01 GMT+0530 (IST)

Rashmika New Instagram Video

వ్వాటే బ్యూటీ  రష్మిక మందన్నా అల్లరి వేషాల గురించి చెప్పాల్సిన పనిలేదు. తనలో ఉన్న ఆ చలాకీతనం.. మాటకారితనం అడిషనల్ క్వాలిఫికేషన్స్. యువనటిలో ఉన్న ఈ కోణతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. అల్లరి..చిల్లర వీడియాలతో..టిక్ టాక్ వీడియోలతో రష్మిక డిజిటల్ మాధ్యమాల్లో బాగా ఫేమస్ అయింది. తాజాగా వాటితో పోలిక లేని సరికొత్త ఛాలెంజింగ్ వీడియో వైలర్ గా మారుతోంది.తాను కోపంగా మంటగా ఉన్నప్పుడు ఇదిగో ఇలా చేస్తానని రష్మిక మందన చెబుతోంది. అయితే దీనికి స్పందించిన ఓ వీరాభిమాని రష్మిక పైనే రివర్స్ పంచ్ వేసాడు. అయినా నిన్ను ఇలా చూశాక రీటేక్ అడిగే డైరెక్టర్ ఉంటాడా? షాట్ ఓకే!! అంటూ ఫన్నీ కామెంట్ ని చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక రష్మిక ఇన్ స్టాలో అల్లరి వేషాల వీడియోలకు కొదవేమీ లేదు.

ఇంతకుముందు వేరొక అల్లర వేషానికి సంబంధించిన ఓ వీడియో అంతే వైరల్ అయ్యింది. గంప కింద కోడిలా రష్మిక సరిగ్గ  నాటు కోళ్ల ఫామ్ లోకి దూరింది. అలాగని ఆ కోళ్లను చూసి ఊరుకుందా? ... ఏదో ఒక అల్లరి పని చేయాలిగా. సరిగ్గా అలాంటి పనే చేసింది. నోటి నిండుగా నీళ్లు పెట్టుకుని నాటు కోడి పుంజు శిరముపై నోటితో ఉమ్మి రీఫ్రెషింగ్ చేసింది. దీంతో కోడి ఆ నీళ్లను దులుపుకుని  పందానికి నేను సిద్దమంటూ సర్రున లేచి మీద పడే ప్రయత్నం చేసింది. దీంతో రష్మిక అక్కడ నుంచి దూరంగా పారిపోయింది.  సహజంగా ఇలాంటి సన్నివేశాల్ని సంక్రాంతి కోడి పుంజుల పోటీల్లో చూస్తుంటాం. పందెం పుంజులు కోద్ది సేపు పోరాటం చేసిన తర్వాత బ్రేక్ సమయంలో  వాటికి రిఫ్రెషింగ్ గా ఉండటానికి పందెం కట్టేవాడు కోడి పుంజు ముఖం మీద నీటిని పుక్కిలించి రీఫ్రెషింగ్ చేస్తాడు. దీంతో కోడి పుంజుకి ఎక్కడ లేని ఉత్సాహంతో పోటీలో పాల్గొంటుంది. మరి రష్మిక ఏ పోటీ కోసం అ పుంజుని అలా రెచ్చ గొట్టిందో తనకే తెలియాలి.

ఇక రష్మిక  సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`లో నటిస్తోంది. అలాగే ధృవ సార్జా హీరోగా నంద భాస్కర్ దర్శకత్వంలో తెలుగు..తమిళ్..కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న `పొగరు`లో నటిస్తోంది. మరోవైపు `ఆడవాళ్లు మీకు జోహార్లు` అనే చిత్రం షూటింగ్ లోనూ బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`..`గుడ్ బై` చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు లైనప్ లో ఉన్నాయి.