Begin typing your search above and press return to search.

వీడియో : కమర్షియల్‌ బ్యూటీ ఎంతగా కష్టపడుతుందో చూడండి

By:  Tupaki Desk   |   30 Jun 2022 12:22 PM GMT
వీడియో : కమర్షియల్‌ బ్యూటీ ఎంతగా కష్టపడుతుందో చూడండి
X
ఊహలు గుసగుసలాడే సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. తెలుగు లో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఉంది. మీడియం రేంజ్ సినిమాల్లో నటిస్తూ పెద్ద హీరోయిన్ గా పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో తమిళంలో ఈ అమ్మడు వరుసగా స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తూ ఇప్పటికే అక్కడ స్టార్‌ హీరోయిన్ గా పేరును దక్కించుకుంది.

టాలీవుడ్‌ లో తాజాగా ఈ అమ్మడు నటించిన చిత్రం 'పక్కా కమర్షియల్‌'. గోపీచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్‌ సినిమా రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్ లో రాశి ఖన్నా బిజీ బిజీగా పాల్గొంటుంది. మరో పక్క తమిళ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ రాశి ఖన్నా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.

హీరోయిన్ గా రాశి ఖన్నా చేస్తున్న సినిమా లు చాలా ఉన్నాయి. వాటి షూటింగ్‌.. ప్రమోషన్‌ కార్యక్రమాలు బ్యాలన్స్ చేసుకుంటూ షిప్ట్‌ లుగా ఈమె వర్క్ చేస్తుంది.

తాజాగా రాశి ఖన్నా షేర్‌ చేసిన వీడియో ఆమె ఎంత బిజీ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. షూటింగ్‌ లో పాల్గొని అక్కడ నుండి ఎయిర్ పోర్ట్‌ కు హడావుడిగా చేరుకుని వెంటనే సినిమా ఈవెంట్‌ కు రెడీ అయ్యింది.

కొద్ది గంటల తేడాలోనే రెండు భారీ ఈవెంట్స్ లో పాల్గొనడం మాత్రమే కాకుండా మళ్లీ షూటింగ్‌ లో కూడా పాల్గొనడం ఆమెకే చెల్లింది. హైదరాబాద్‌ మరియు చెన్నై కి రెగ్యులర్ గా తిరుగుతూ అక్కడ ఇక్కడ బిజీ బిజీ గా ఉన్న రాశి ఖన్నా పక్కా కమర్షియల్‌ సినిమా హిట్‌ అయితే స్టార్ హీరోల కు జోడీగా నటించే అవకాశం దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బన్నీ వాసు నిర్మించిన పక్కా కమర్షియల్‌ సినిమా ను అల్లు అరవింద్ సమర్పించాడు. మంచి కాన్సెప్ట్ తో మారుతి తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్‌ కావాలంటూ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న మెగాస్టార్‌ చిరంజీవి కోరుకుంటూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ సమయంలోనే రాశి ఖన్నా గురించి చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడి ఆమె అందంను మరియు అభినయం గురించి కామెంట్స్‌ చేశారు.