Begin typing your search above and press return to search.

రామ్, బోయపాటిల సినిమా ఇప్పట్లో లేనట్టే..?

By:  Tupaki Desk   |   21 March 2023 6:00 AM GMT
రామ్, బోయపాటిల సినిమా ఇప్పట్లో లేనట్టే..?
X
యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవదాసు సినిమాతో 2006లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఆయన.. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్నాడు. జగడం, రెడీ, మస్కా, గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఉన్నది ఒకటి జిందగీ, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో లక్షలాది మంది అబిమానుల్ని సొంతం చేసుకున్నాడు.

తాజాగా రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ది వారియర్ తర్వాత రామ్ పోతినేనితో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. అలాగే అఖండ వంటి సూపర్ డూపర్ తర్వాత బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో అందరి చూపు ఈ సినిమాపైనే పడింది. ఆయితే ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటో వచ్చే ఛాన్సు ఏం లేనట్లు సమాచారం.

ఈ చిత్రంలో రామ్ సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో బోయపాటి అంచనాలకు మాత్రం తగ్గకుండా చాలా జాగ్రత్తగా చిత్రాన్ని తెరకెక్కించారట. ఇందులో రామ్ కూడా పక్కా మాస్ గెటప్ లో కనిపించనున్నాడని టాక్. అంతేకాకుండా ఈ సినిమా కోసం అత్యంత నైపుణ్యం గల సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారట.

అయితే రామ్, బోయపాటి కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇందుకు సంబంధించిన ఏర్పట్లు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ లో ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. అలాగే టాలీవుడ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.