కనిపించదుగానీ లావణ్యలో చాలా వెటకారం ఉంది: హీరో

Mon Mar 01 2021 13:00:01 GMT+0530 (IST)

ram pothineni Speech At A1 Express Pre Release Event

సందీప్ కిషన్ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'A1 ఎక్స్ ప్రెస్' సినిమా ఈ నెల 5వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో రామ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ ఒక మంచి సినిమాను అందిస్తున్న దర్శక నిర్మాతలను అభినందించారు. దర్శకుడు డెన్నీస్ జీవన్ కనుకొలను మాటలను బట్టే ఆయన ఎంతటి అంకితభావంతో ఈ సినిమాను చేశాడనేది తనకి అర్థమైందని చెప్పాడు. ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాను 40 రోజుల్లో తీయడం అంత తేలికైన విషయం కాదని అన్నాడు.ఇక లావణ్య విషయానికొస్తే ఆమె సంగతి మీకు తెలియదు .. తాను ఈస్టు గోదావరిలో పుట్టింది .. తనకున్న వెటకారం నేను ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ దగ్గర చూడలేదు. కనిపించదుగానీ ఆమెది చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. ఏ సమయంలో ఫోన్ చేసినా నవ్విస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో ఆమె చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది .. అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ సమయంలో లావణ్య త్రిపాఠి అలా నవ్వుతూనే ఉంది. ఆ తరువాత సందీప్ కిషన్ గురించి రామ్ ప్రస్తావించాడు.

సందీప్ తన ఫ్రెండ్స్ తో కలిసి చెన్నైలో కనిపించేవాడు. ఆ తరువాత కొన్నాళ్లకు గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నట్టు తెలిసింది. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడనీ .. హీరో అయ్యాడని తెలిసింది. ఆయన జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. హీరోగా చేస్తూనే నిర్మాతగా మారిపోయాడు .. అంతేకాదు ఏవో బిజినెస్ లు కూడా మొదలుపెడుతున్నాడు. ఒకేసారి ఇన్నింటిపై దృష్టిపట్టడం మామూలు విషయం కాదు. మార్చి 5వ తేదీన వస్తున్న 'A1 ఎక్స్ ప్రెస్' సందీప్ కిషన్ కి 25వ సినిమా .. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది" అంటూ చెప్పుకొచ్చాడు.