ఫోటో స్టోరీ: కత్తిలాంటి భంగిమ హై!

Fri May 29 2020 21:30:22 GMT+0530 (IST)

rakul preet attracting with denim outfit

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందంటే మహమ్మారి దెబ్బకు అందరూ పనిలేకుండా కూర్చుంటే రకుల్ మాత్రం తన ఫిట్నెస్ పై ఫోకస్ చేసి కసరత్తుల ఉద్యమం చేపట్టింది. ఇక ఉల్టా పల్టాగా వేలాడే వెరైటీ ఎక్సర్ సైజులతో పాటు శీర్షాసనాలు.. క్లిష్టాసనాలు.. కష్టాసనాలు అన్నీ చేసి యోగాను ఇంతకంటే ఎక్కువగా ఎవరూ చెయ్యలేరని నిరూపించింది.ఇక ఈ విషయాలను క్రమం తప్పకుండా నెటిజన్లతో పంచుకుంటూ వారిని చైతన్యపరుస్తూ కసరత్తుల విప్లవమార్గంలో నడిపిస్తోంది. వీటితో పాటుగా గ్లామరసం చిందించే అందాల భంగిమలతో సోషల్ మీడియాలో డిజిటల్ సమ్మర్ ను తీసుకొస్తూ అందరి మనసుల్లోని కళాత్మకతను మెరుగుపరుస్తూ ఆ రకంగా ముందుకు సాగిపోతోంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "అంతా రంగుల మయం కానీ నలుపు - తెలుపు అంతకంటే ఎక్కువ" అంటూ భలే క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటోలో డెనిమ్ షర్టు.. డెనిమ్ ప్యాంట్.. అంటే ఏం లేదు.. జస్ట్ జీన్స్ డ్రెస్ ధరించి ఓ భంగిమనిచ్చింది. ఈ భంగిమలో ప్రత్యేకత చొక్కా బొత్తాలు.. ఉన్నా లేనట్టు నటిస్తున్నాయి. అలా చేయడంతో టన్నుల కొద్ది గ్లామర్ బయటపడింది.

ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి ఈ ఫోటోకు ఓ ఫసాక్ రెస్పాన్స్ ఇచ్చారు "40 కానీ ఈ ఫోటోను చూసిన తర్వాత 16 అనిపిస్తోంది.. చాలా కూల్.. చాలా చిల్ అయినా మంటలు రేగుతున్నాయి. సిజ్లీ మామా" అంటూ తనదైన శైలిలో ఓ సూపర్ కామెంట్ పెట్టారు. దీనికి పూర్తి అర్థం తెలియాలంటే ఎంతో మేధాశక్తి అవసరం. అందుకే ఎక్కువ ఆలోచించకుండా లక్ష్మిగారు ఎగ్జైట్ అయ్యారని మాత్రం గుర్తించండి.