Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వాన‌లొచ్చినా స‌ల‌స‌ల కాగిపోతోంద‌ట‌

By:  Tupaki Desk   |   19 Jun 2021 2:30 AM GMT
ఫోటో స్టోరి: వాన‌లొచ్చినా స‌ల‌స‌ల కాగిపోతోంద‌ట‌
X
వేస‌వి వెళ్లి వానాకాలం ప్ర‌వేశించినా చిట‌ప‌ట చినుకులు ముంబైని త‌డిపి ముద్ద చేసేస్తున్నా ఇంకా ర‌కుల్ బాడీ కూల్ అవ్వ‌లేద‌ట‌. చిరుజ‌ల్లులు కురుస్తున్నా కానీ ఎందుక‌నో త‌న మైండ్ స‌ల‌స‌ల కాగిపోతోంద‌ని సెల‌విస్తోంది.

అంతేకాదు బీచ్ రిసార్ట్ లో రిలాక్స్ డ్ గా కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. పూల్ లోకి దిగి ఈత కొట్టే ముందు త‌న మైండ్ సెట్ ఎలా ఉందో చెబుతోంది. ఉష్ట‌మండ‌ల గాలుల‌తో త‌న బాడీ ఇంకా కూల్ కాలేద‌ని త‌న‌ స్టేట్ ఆఫ్ మైండ్ చెప్ప‌క‌నే చెబుతోంది.

అయితే దీని నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఏ మాల్దీవుల విహార‌మో గోవా ట్రిప్ కో వెళ్లాలి కానీ ఏం ఆలోచిస్తోంది అక్క‌డ‌. జ‌స్ట్ అప్పుడే అలా రిలాక్స‌య్యి పూల్ లో దిగేందుకు రెడీ అవుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. అలా బికినీని క‌వ‌ర్ చేస్తూ లూజ్ చొక్కాయ్ ధ‌రించింది స‌రే.. ఆ చెవుల‌కు వేలాడుతున్న ల‌వ్ లోలాకుల్ని చూశారా.. సంథింగ్ హాట్ గా క‌నిపించ‌డం లేదూ? స్మైలీ ఫేస్ తో లోలోన కాగుతున్న ఆ సంగ‌తేంటో క‌నిపెట్ట‌డం కాస్త క‌ష్టంగానే ఉంది. అదేంటో ర‌కుల్ చెబితేనే బావుంటుంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భార‌తీయుడు 2లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ వివాదాల వ‌ల్ల నిలిచిపోయింది. అలాగే రోనీ స్క్రూవాలా RSVP చలన చిత్రం బ్యాన‌ర్ లో ఓ ప్రాజెక్టుకు సంతకం చేసింది. ఈ చిత్రానికి తేజస్ డియోస్కర్ దర్శకత్వం వహించనున్నారు. అటాక్‌లో జాన్ అబ్రహం- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి ర‌కుల్ నటించారు. లాక్ డౌన్ ముందు అమితాబ్ బచ్చన్ -అజయ్ దేవ‌గ‌న్ తో కలిసి మేడే షూటింగ్ లో పాల్గొన్నారు. అర్జున్ కపూర్ తో కలిసి సర్దార్ కా గ్రాండ్‌సన్ లో చివరిసారి కనిపించిన సంగ‌తి తెలిసిందే.