మరీ సన్నజాజి తీగలా చిక్కిపోతే కష్టమే రకుల్!

Wed Jun 09 2021 06:00:01 GMT+0530 (IST)

rakul preet singh Latest Photo

మరీ జాజి కొమ్మలా మెరుపు తీగలా అలా సన్నబడిపోతోందేమిటి రకుల్?  ఇటీవల ఊహించిన దానికంటే వెయిట్ తగ్గిపోతూ ఆశ్చర్యపరుస్తోంది. మరీ అంతగా ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టేసినా కష్టమేనేమో ఇక!!



ఈ లాక్ డౌన్ సీజన్ లో రకుల్ పూర్తిగా హిందీ కెరీర్ పైనా దృష్టి సారిస్తోందట. అందుకే ఇలా జీరో సైజ్ నుంచి ఏకంగా మైనస్ లెవల్ కి పడిపోతోంది. మునుపటితో పోలిస్తే ఆ ఫేస్ లో ఛామ్ తగ్గింది. జిమ్ ఎఫెక్ట్ స్పష్ఠంగా బయటపడిపోతోంది. ఇక ఆ నాభి సౌందర్యం అంతా మాయమై అక్కడ ఆరు పలకలు కనిపించేస్తున్నాయి.

తనకు ఎంతో ఇష్టమైన రాక్ క్యాజిల్స్ లో ఇదిగో ఇలా ఫోజులిచ్చిన రకుల్ ని చూడగానే కుర్రకారు అరెరే..! అంటూ పరేషాన్ అయిపోతున్నారు. రకుల్ మరీ టూమచ్ చేస్తోంది. సన్నబడితే మంచిదే కానీ మరీ ఇంతగానా? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. బాగా మైనస్ లోకి వెళ్లిపోవడంతో తాను ధరించిన దుస్తులు కూడా తనకు ఏమాత్రం సూట్ కాలేదంటూ విమర్శించేస్తున్నారు. మరి వీటన్నిటికి రకుల్ ఎలా సమాధానం ఇస్తుందో చూడాలి. ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఫిట్నెస్ పై మరింత శ్రద్ధ పెడుతోంది. ఇక కోవిడ్ వల్ల తాను తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని దాని నుంచి బయటపడేందుకు యోగాసనాల్ని ప్రాణాయామాన్ని ఆశ్రయించానని తెలిపింది.

రకుల్ ప్రీత్ సింగ్ తదుపరిసారి అజయ్ దేవ్ గన్ దర్శకత్వం వహిస్తున్న `మేడే`లో కథానాయికగా నటిస్తోంది. భారతీయుడు 2లోనూ ఒక నాయిక. క్రిష్ తెరకెక్కించిన కొండపొలం రిలీజ్ కావాల్సి ఉంది. అనుభూతి కశ్యప్ క్యాంపస్ కామెడీ-డ్రామా `డాక్టర్ జి` లోనూ రకుల్ నటిస్తోంది. ఆయుష్మాన్ ఖుర్రానా ఇందులో హీరో. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న `ఛత్రివాలి`లో.. ఇంద్ర కుమార్ `స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ`లో కూడా ఆమె నటించనుంది.