Begin typing your search above and press return to search.

వంట ఆడవాళ్లే ఎందుకు నేర్చుకోవాలని ప్రశ్నిస్తున్న 'డర్టీ' భామ..!

By:  Tupaki Desk   |   13 Jun 2021 6:30 AM GMT
వంట ఆడవాళ్లే ఎందుకు నేర్చుకోవాలని ప్రశ్నిస్తున్న డర్టీ భామ..!
X
బాలీవుడ్ ముద్దుగుమ్మ విద్యాబాలన్ ఓ వైపు బోల్డ్ క్యారెక్టర్స్ లో నటిస్తూనే.. మరోవైపు హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులకు మెప్పిస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత తన వయసుకి తగ్గ పాత్రలు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇక సినిమాల్లో బోల్డ్ గా నటించే విద్య.. బయట కూడా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ సంచలనం సృష్టిస్తుంది. లో దుస్తుల గురించి ఓపెన్ గా మాట్లాడేస్తుంది.. తనంటే నచ్చని వారు తన సినిమాలు చూడనక్కర్లేదని స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. సమాజంలో మహిళలు - లింగ వివక్ష గురించి మాట్లాడే విద్య.. వంట ఆడవాళ్లే ఎందుకు నేర్చుకోవాలని ప్రశ్నిస్తోంది.

భోజనం చేసే టైమ్ లో చాలామంది తనకు వంట చేయడం రాదని అనేవారని.. వంట నేర్చుకోమని చెప్పేవారని విద్యా బాలన్ చెప్పింది. అయితే తన భర్తకు కూడా వంట రాదని చెప్పేదాన్నని.. కానీ వాళ్లు ఒప్పుకునే వాళ్లు కాదని.. తప్పకుండా నువ్వే వంట నేర్చుకోవాలి అనేవారని.. ఇప్పటికీ మహిళల్నే వంట నేర్చుకోమని ఎందుకు చెప్తారో తనకు అర్థంకావడం లేదని చెప్పింది. వంట నేర్చుకోమని ఇంట్లో పెద్దలు కూడా చెప్పేవారని.. వంట తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పేదాన్ని అని విద్యాబాలన్ తెలిపింది. లింగ వివక్ష అందరం ఎదుర్కొంటామని.. కానీ ఓ మహిళను మరో మహిళ ప్రశ్నించడం చూస్తే చాలా కోపం వస్తుందని విద్యా చెప్పుకొచ్చింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ''షేర్ని'' చిత్రం ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 18 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. 'న్యూటన్' ఫేమ్ అమిత్ మసూర్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విద్యా బాలన్ ఒక నిజాయితీ గల లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.