రష్యాలో పుష్ప రాజ్ హంగామా..!

Fri Dec 02 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

pushpa movie in russia

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ మూవీలో పుష్ప రాజ్ పాత్ర లో అల్లు అర్జున్ తన నటనతో బీభత్సం సృష్టించారు. సుకుమార్ డైరెక్షన్ టాలెంట్ తో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన పుష్ప మూవీ ఇప్పుడు దేశాలు దాటి సంచలనాలు సృష్టించబోతుంది. లేటెస్ట్ గా పుష్ప మూవీ రష్యన్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా పుష్ప టీం అంతా రష్యా చెక్కేసింది. అక్కడ పలు మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ స్టార్ గా మారాడు. ఈ మూవీలో అతని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యనే ఆర్.ఆర్.ఆర్ సినిమాతో జపాన్ లో మన స్టార్స్ సందడి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇదే క్రమంలో అల్లు అర్జున్ కూడా రష్యాలో హంగామా సృష్టిస్తున్నాడు. పుష్ప టీం అక్కడికి చేరుకోగానే రష్యన్ సినీ లవర్స్ వారికి గ్రేట్ ఇన్విటేషన్ అందించారట.

ఇక అక్కడ పలు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్నారు చిత్రయూనిట్. ఈ క్రమంలో అల్లు అర్జున్ కోసం ఒక స్పెషల్ అభిమాని రావడం బన్నీని ఇంప్రెస్ చెసింది. ఇక దివ్యాంగుడు బన్నీ మీద అభిమానం చూపించడంతో అతని కోసం అల్లు అర్జున్ మోకాళ్ల మీద కూర్చుని అతనితో ఫోటోలు దిగాడు. 

సినిమాలతో తమ స్థాయిని విస్తరింప చేసుకుంటున్న అల్లు అర్జున్.. పుష్ప రాజ్ పాత్రలో వరల్డ్ సినీ లవర్స్ అందరిని మెప్పించాడు. పుష్ప రాజ్ నీయవ్వ తగ్గేదేలే అన్న సిగ్నేచర్ డైలాగ్ ఇప్పుడు అందరూ ఇమిటేట్ చేస్తున్నారు. రష్యాలో పుష్ప హంగామా ఓ రేంజ్ లో ఉండబోతుంది. జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ తో ఎన్.టి.ఆర్ రాం చరణ్ లకు క్రేజీ ఫ్యాన్స్ ఏర్పడగా అల్లు అర్జున్ కు రష్యాలో సూపర్ క్రేజ్ ఏర్పడింది.

పుష్ప 1 సంచలనాలు ఇలా ఉండగా నెక్స్ట్ ఇయర్ పుష్ప 2 రాబోతుంది. పుష్ప 1 అక్కడక్కడ కొద్దిపాటి గ్యాప్ తో రిలీజ్ అవగా పుష్ప 2 ని వరల్డ్ వైడ్ గా ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో టాలీవుడ్ నుంచి పుష్ప 2 తప్పకుండా మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.