పూరి `జనగణమన` పట్టాలెక్కేనా?

Wed Dec 08 2021 13:00:01 GMT+0530 (IST)

puri jagannadh Dream Project jana gana mana

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన`. గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని పూరి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ముందు ఈ ప్రాజెక్ట్ ని సూపర్ స్టార్ మహేష్ ఆబుతో చేయాలని ఫిక్సయ్యారు.`బిజినెస్‌మెన్` మూవీ తరువాత ఖచ్చితంగా వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమా ఇదే అని ప్రచారం కూడా జరిగింది. కానీ ఏం జరిగిందో తెలియదు.. ఇద్దరి మధ్య దూర పెరిగింది.. పూరి కూడా మహేష్ కు దూరంగా వుండటం మొదలు పెట్టారు.. దాంతో `జన గణ మన` ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టేశాడు పూరి.

ఒక దశలో ఈ మూవీని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తో చేయబోతున్నారంటూ వార్తలు షికారు చేశాయి. కానీ పూరి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇక అటకెక్కేసినట్టే అని అంతా భావించారు. కానీ ఆ మధ్య పూరి బర్త్‌డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ విషేస్ చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

`సర్కారు వారి పాట` పూజా కార్యక్రమాల్లోనూ తను పాల్గొనలేకపోయానని పూరి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం.. ఆ తరువాత రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` షోలో ప్రత్యేకంగా పాల్గొన్న మహేష్ ... ఫోన్ ఫ్రెండ్ గా ఎవరు కావాలని అడిగితే కొరటాల శివ పూరి జగన్నాథ్ త్రివిక్రమ్‌ల పేర్లు చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గతంలో మహేష్ - పూరిల మధ్య `బిజినెస్ మెన్` మూవీ తరువాత మనస్పర్థలు తలెత్తాయి. అయితే అవి క్రమేనా కాలంతో పాటు కరిగిపోయాయి. దీంతో ఈ ఇద్దరి కలయికలో పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడం ఖాయంగా కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ కూడా పూరితో కలిసి సినిమా చేయాలని ఆసక్తిగా వున్నారని ఇన్ సైడ్ టాక్.

ప్రస్తుతం మహేష్ బాబు `సర్కారు వారి పాట` మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత వెంటనే త్రివిక్రమ్ తో చేయనున్న చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. ఈ మూవీ తరువాత రాజమౌళి సినిమా వుంటుంది. ఆ తరువాతే పూరి తో `జన గణ మన` కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు వున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మహేష్ ఫ్యాన్స్‌కి పండగే అంటున్నారు సినీ జనం.