Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ప‌న్ను ఎగ‌వేత‌! డీటెయిల్డ్ గా కూపీ లాగిన‌ మంత్రి!

By:  Tupaki Desk   |   16 Sep 2021 1:30 AM GMT
టాలీవుడ్ ప‌న్ను ఎగ‌వేత‌! డీటెయిల్డ్ గా కూపీ లాగిన‌ మంత్రి!
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ఏపీలో స‌న్నివేశం ఏమంత ఫేవ‌ర్ గా లేద‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. సొంతంగా ప్ర‌భుత్వ‌మే ఆన్ లైన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ‌ను గుప్పిట ప‌ట్టేయ‌డం.. అలాగే టిక్కెట్టు ధ‌ర‌ల స‌వ‌ర‌ణ వ‌గైరా అంశాలు నిజంగానే ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. డి.సురేష్ బాబు స‌హా చాలా మంది అగ్ర నిర్మాత‌ల‌కు గిల్డ్ నిర్మాత‌ల‌కు కూడా అస‌లు ఇది మెడ‌కు గుదిబండ‌లా మారిందంటే అతిశ‌యోక్తి కాదు. ఇన్నాళ్లు రాబ‌ట్టి నంత ఆదాయం ఇక రాబ‌ట్ట‌డం క‌ల్ల అని అంతా న‌మ్ముతున్నారు.

ఇక సీఎం జ‌గ‌న్ తో టాలీవుడ్ పెద్ద‌ల భేటీ డైల‌మాలో ప‌డ‌డంతో ఏదీ తేల‌డం లేదు. ఒక‌వేళ క‌లిసినా టిక్కెట్టు రేటు .. పోర్ట‌ల్ విష‌యంలో ఇక తేల‌ద‌నే అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. పెద్ద‌లు అభ్యంత‌రాలు చెప్పినా కానీ దానిని ఏపీ ప్ర‌భుత్వం వింటుందా? అన్న‌దానిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే అస‌లు ఈ అనుమానాల‌కు మ‌రింత‌గా మంత్రి పేర్ని నాని ప్ర‌క‌ట‌న అగ్గిని యాడ‌ప్ చేసింది.

ఆయ‌న పోస్ట‌ర్ల‌పై లెక్క‌లు మీడియా ముందే అప్ప‌జెప్పారు. టాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు అందుకున్న ఓ రెండు సినిమాల నుంచి ఏకంగా 50కోట్ల ప‌న్ను క‌ట్టాల్సి ఉండ‌గా అదంతా నిర్మాత‌లు ఎగ‌వేసార‌ని ఆయ‌న అన్నారు. తెలుగు నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి ప‌న్ను ఎగ్గొడుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అల వైకుంఠపురములో- సరిలేరు నీకెవ్వరు లెక్క‌లు చెబుతూ.. అల వైకుంఠపురములో చిత్రానికి రూ.150 కోట్లకు పైగా వసూలు చేస్తే ..సరిలేరు నీకెవ్వరు సినిమాకు రూ.120 కోట్లు తెచ్చింద‌ని ఆ సినిమాల హీరోలే చెప్పిన‌ట్టు మంత్రి వ‌ర్యులు అన్నారు. ఏపీలో 80కోట్ల వ‌సూలు చేసినా కానీ ఆ రెండు సినిమాల‌కు క‌లిపి 50కోట్ల ప‌న్ను వ‌సూల‌వ్వాల‌ని కానీ ఏడాది మొత్తం అన్ని సినిమాల‌కు క‌లిపి 39కోట్ల ప‌న్ను మాత్ర‌మే వ‌సూలైంద‌ని మంత్రి నాని లెక్క‌లు తేల్చారు. టికెట్ రేటు రూ.100 దాటితే జీఎస్టీ 18 శాతం చెల్లించాల‌ని.. 10 లోపు ఉంటే 12 శాతమని వెల్ల‌డించారు. 15శాతం ట్యాక్స్ వ‌సూలైనా కేవ‌లం రెండు చిత్రాల నుంచే భారీ మొత్తం రావాల్సి ఉంద‌ని అన్నారు. ఈ ప‌న్ను మొత్తం ఎగ్గొడుతున్నార‌ని నాని లెక్క తేల్చారు. ఆస‌క్తిక‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి టాలీవుడ్ ని షిఫ్ట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఊహించ‌నంత ఆదాయం కోల్పోతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌భుత్వ పెద్ద‌ల వ‌ద్ద లెక్క‌లు ఉన్నాయి. ప్ర‌తియేటా 2500కోట్లు పైగా ప‌రిశ్ర‌మ నుంచి ఏపీకి ఆదాయం రావాల్సి ఉంటుంది. బ‌డా నిర్మాత‌లంతా ఏపీకి చెందిన వారే అయినా చాలా వ‌ర‌కూ ఆదాయం హైద‌రాబాద్ లోనే ప‌రిశ్ర‌మ ఉండ‌డం వ‌ల్ల అదంతా తెలంగాణ ప్ర‌భుత్వానికి వెళ్లిపోతోంద‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు సీరియ‌స్ గా దృష్టి పెట్టింది.