Begin typing your search above and press return to search.

న‌ష్టాలొచ్చిన పంపిణీదారుల‌కు హ్యాండిచ్చిన నిర్మాత‌

By:  Tupaki Desk   |   25 Sep 2021 12:30 PM GMT
న‌ష్టాలొచ్చిన పంపిణీదారుల‌కు హ్యాండిచ్చిన నిర్మాత‌
X
సినిమా హిట్ట‌యితే అంద‌రికీ లాభాలు. ప్లాప్ అయినా కొంద‌రికి లాభాలుంటాయి. కానీ అక్క‌డ కండీష‌న్స్ అప్లై అవుతాయి. సినిమా అనేది తీయ‌డం వ‌ర‌కే నిర్మాత పని. త‌ర్వాత ఆ సినిమాను తానే సొంతంగా రిలీజ్ చేస్తాడా? లాభాల‌కు బ‌య‌ట కంపెనీల‌కు అమ్ముకుంటారా? అన్న‌ది అత‌నిష్టం. అయితే ఒక‌వేళ ప్లాప్ అయితే డిస్రిబ్యూట‌ర్ల‌కు కొంత రిక‌వ‌రీ ఇవ్వాల‌ని...ఇంకా కొన్ని నిబంధ‌న‌లుంటాయి. కానీ ఇవ‌న్నీ ఇటీవ‌ల‌ ప్రాక్టిక‌ల్ గా అమ‌ల‌య్యేది చాలా త‌క్కువ శాత‌మే. అందుకే పెద్ద పెద్ద బ‌డా నిర్మాణ సంస్థ‌ల‌పై కేసులు.. హీరోల‌పైనా పోలీస్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

అందుకే వీట‌న్నింటికంటే ఉత్త‌మ‌మైన మార్గం అండ‌ర్ స్టాండింగ్... ఒక‌రిప‌ట్ల మ‌రొక‌రు చ‌నువుగా మెల‌డం...స్నేహంగా ఉండ‌టం వంటివి చాలా ముఖ్యం. ఇండ‌స్ట్రీలో కొంత వ‌ర‌కూ న‌ష్టాల్ని భ‌ర్తీ చేయ‌డంలో ప‌నికొస్తాయి. కోలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో ఆ పోక‌డ ఎక్కువగా క‌నిపిస్తుంది. అందుకే కోలీవుడ్ పోలీస్ స్టేష‌న్ల‌లో న‌మోదైనన్ని కేసులు టాలీవుడ్ లో న‌మోదు కాలేదని మ‌న నిర్మాత‌లు చెబుతారు. ఈ సినిమాలో న‌ష్టం వ‌స్తే మ‌రో సినిమాలో చూసుకుందాం.. అన్న మాట‌తో ఇక్క‌డ డిస్ట్రిబ్యూట‌ర్లు త్వ‌ర‌గా వివాదాల జోలికి వెళ్ల‌రు. డిస్ట్రిబ్యూష‌న్ రంగం నుంచి నిర్మాత‌లైన వారెంద‌రో ఉన్నారు. అలాగే పంపిణీదారుల్లో రోడ్డున ప‌డ్డ‌వారు ఉన్నారు.

ఎక్క‌డైనా రిస్క్ తీసుకుంటేనే దొరుతుంది అన్న మాట‌ను అనుస‌రించి ముందుకెళ్లిపోవ‌డ‌మే. ఇటీవ‌లే ఓ చిన్న సినిమా విష‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు కాస్త ఇబ్బంది ఎదురైందిట‌. ఆ సినిమా నిర్మించింది చిన్న‌వాడే అయినా.. ప‌లుకబ‌డి ఉండ‌టంతో డిస్ట్రిబ్యూట‌ర్లు త‌మ న‌ష్టాల్ని చెప్పుకోలేక ఇబ్బంది ప‌డుతున్నారుట‌. గ‌ట్టిగా అడ‌గ‌లేక‌..అలాగ‌ని నెమ్మ‌దిగా చెప్ప‌లేక క‌కావిక‌ల‌మైపోతున్నారుట‌. చివ‌రికి సాహ‌సం చేసి స‌మ‌స్య‌ని చెప్పుకుండే సింపుల్ గా త‌ర్వాత చూద్దాం లే అనేసారుట ఆ నిర్మాత‌.