క్లిక్ క్లిక్ : గ్లోబల్ స్టార్ కపుల్ బీచ్ లో రొమాన్స్

Mon Jun 27 2022 21:00:01 GMT+0530 (IST)

priyanka chopra nick jonas latest photo

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు మరియు సిరీస్ లతో కూడా చాలా బిజీగా ఉంది. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ తో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్ లు మరియు స్టేజ్ షో లతో రెగ్యులర్ గా బిజీగా ఉండే వీరిద్దరు తాజాగా బీచ్ లో సరదాగా రొమాన్స్ చేస్తూ కనిపించారు.ప్రియాంక చోప్రా ఈ ఫోటోలను షేర్ చేసింది. సోషల్ మీడియాలో పీసీ మరియు నిక్ లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్స్ అనడంలో సందేహం లేదు.

ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికి మంచి గుర్తింపు ఉంది. అమెరికాలో అత్యంత విలాసవంతమైన నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ జోడీ సందర్భానుసారంగా ఇలా హాలీడేస్ కు వెళ్లడం చూస్తూనే ఉన్నాం.

ఈసారి బీచ్ లో ఇద్దరు కలిసి చిల్ అవుతున్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అట్లాంటిక్ సముద్రంలోని టర్క్ అండ్ కైకోస్ దీవుల్లో వీరిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా వరల్డ్ లో వైరల్ అవుతున్నాయి. ఐస్ ల్యాండ్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాం అంటూ ఇద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఈ ఫోటోలకు ఎంతో మంది సెలబ్రెటీలు లైక్స్ మరియు కామెంట్స్ రూపంలో తమ స్పందన తెలియజేశారు. కొన్ని నెలల క్రితం ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు.

అయితే ఇప్పటి వరకు కూడా వీరిద్దరు తమ బిడ్డను బయటి ప్రపంచం కు చూపించలేదు. ఆ మధ్య ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి.. కాని అధికారికంగా మాత్రం వీరు ఇప్పటి వరకు ఫొటోలు రిలీజ్ చేసిన దాఖలాలు లేవు.