Begin typing your search above and press return to search.

సలార్ మాత్రమే కాదు ప్రభాస్ దేవా కూడా..?

By:  Tupaki Desk   |   17 March 2023 5:00 AM GMT
సలార్ మాత్రమే కాదు ప్రభాస్ దేవా కూడా..?
X
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు. ఆదిపురుష్ 100 రోజుల కౌంట్ డౌన్ స్టార్ట్ అవగా జూన్ లో సినిమా రిలీజ్ ఫిక్స్ అంటున్నారు. ఇక రెండు నెలలు గ్యాప్ ఇచ్చి సలార్ కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ప్రభాస్ సలార్ సినిమా కూడా రెండు పార్ట్ లుగా వస్తుందని టాక్. సలార్ టీం నుంచి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు కానీ టీజర్ నాడు ఆ విషయం రివీల్ చేస్తారట. సలార్ లో మొదటి పార్ట్ లో ప్రభాస్ సలార్ గా కనిపిస్తాడట.

ఇక సలార్ పార్ట్ 2లో ప్రభాస్ దేవగా కనిపిస్తాడట. ప్రభాస్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా కనిపిస్తారట. అయితే బాహుబలి తరహాలో ఇద్దరు కనిపించరా లేక రివెంజ్ స్టోరీ కాబట్టి ఇద్దరు సలార్, దేవా కనిపిస్తారా అన్నది చూడాలి. దేవా పాత్రని రివీల్ చేయకుండా చిత్రయూనిట్ చాలా జాగ్రత్త పడుతుందట. సలార్ ఫస్ట్ పార్ట్ చివర్లోనే ఆ పాత్రని రివీల్ చేస్తారట.

అలా రివీల్ చేయడం వల్ల సలార్ పార్ట్ 2 మీద అంచనాలు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే సలార్ 1, 2 పార్ట్ ల షూటింగ్ ఒకేసారి చేస్తున్నారా లేక కె.జి.ఎఫ్ లానే రెండో పార్ట్ కి మళ్లీ షూటింగ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కె.జి.ఎఫ్ నిర్మాతలే కాబట్టి సలార్ సినిమాను కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ప్రభాస్ కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది.

ఆదిపురుష్ రిలీజ్ తర్వాత సలార్ వస్తుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ప్రాజెక్ట్ కె వస్తుంది. ఈ సినిమాలతో ప్రభాస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాల తర్వత సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది ప్రభాస్. అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో సినిమా అంటే అది మామూలు విషయం కాదు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ వరుస సినిమాల తో ఫుల్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.