తొమ్మిది రకాల వంటకాలతో పూర్ణ కడుపు నింపిన ఫ్యామిలీ!

Tue Mar 21 2023 20:43:01 GMT+0530 (India Standard Time)

poorna has entered her 9th month is happy with the work done by her family members

నటి పూర్ణి దుబాయ్ వ్యాపార వేత్త షానిద్ అసిఫ్ అలీని  వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  అంగరంగా వైభంగా చేసుకోవాల్సిన పెళ్లిని పూర్ణ చాలా సింపుల్ గా కానిచ్చేసింది. ఇది ఓ రకంగా రహస్య వివాహంగానే జరిగింది. నిశ్చితార్ధం గురించి మీడియాకి లీక్ ఇచ్చింది గానీ-పెళ్లి గురించి మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు.   వివాహం అయిన తర్వాత పెళ్లి  ఫోటోలతో సర్ ప్రైజ్ చేసింది.



ఈ వివాహం ఇరు కుటుంబ సభ్యులు-స్నేహితులు-సన్నిహితుల సమక్షంలో గతేడాది మే లో   నిరాండంబరంగా వివాహం  జరిగింది. ఇక పూర్ణ గర్భం దాల్చిన విషయాన్ని మాత్రం ముందే రివీల్ చేసింది. తాజాగా ఇప్పుడామెకు నెలలు నిండినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం  తొమ్మిదవ నెల. దీంతో  ఆమెకి కుటుంబసభ్యులు స్వీట్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. పూర్ణకు ఇష్టమైన తొమ్మిది రకాల వంటకాలు చేసి తినిపించారు.

ఆమె కోసం తల్లి- సిస్టర్ చేసిన వంటకాలు చూపిస్తూ ఓ  వీడియో చేశారు. ఆ వంటకాలను పూర్ణకు భర్త అసిఫ్ అలీ ప్రేమగా తినిపించారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో చెప్పుకుని పూర్ణ సంబర పడింది. ప్రస్తుతం ఆ కుటుంబం ఎంతో సంతోషంలో మునిగి తేలుతుంది. కొన్ని రోజుల్లో ఓ బేబికి జన్మనివ్వబోతుంది అన్న ఆనందం కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది.

ఇక పూర్ణ వృత్తి పరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా  ముందుకు సాగుతుంది. పెళ్లి  చేసుకున్నా భర్త అనుమతితో వృత్తిని కొనసాగిస్తుంది. అయితే గర్భవతి కావడంతో కొన్ని నెలలుగా బుల్లి తెర షోస్ కి దూరంగా ఉంటోంది. ఈ దూరం మరికొన్ని నెలలు తప్పదు. ప్రసవం తర్వాత విశ్రాంతి కోసం మూడు నాలుగు నెలలు సమయం కేటాయించే అవకాశం ఉంది. అటుపై మళ్లీ కంబ్యాక్ అవ్వనుంది. అలాగే నటిగానూ మళ్లీ బిజీ అవుతోంది. హీరోయిన్ గా ఎగ్జిట్ అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.