టోన్డ్ ఫిజిక్ తో గుబులు రేపుతున్న పూజా

Mon Jan 17 2022 10:46:00 GMT+0530 (IST)

pooja with toned physique

బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతోంది. వరుసగా అగ్ర హీరోలతో నటిస్తోంది పూజా. బ్లాక్ బస్టర్లతో స్టార్ డమ్ ని ఆస్వాధిస్తోంది. ఇక పూజా నటించిన రాధేశ్యామ్ పాన్ ఇండియా కేటగిరీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఇదే ఏడాదిలో పూజా నటించిన ఐదు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కానున్నాయి.మరోవైపు పూజా టోన్డ్ ఫిజిక్ ని ఎలివేట్ చూస్తూ వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు పూజా మాల్దీవుల విహారం నుంచి వరుస బికినీ ఫోటోలను షేర్ చేయగా అవి అంతర్జాలాన్ని హీటెక్కించాయి. ఇప్పుడు మరోసారి తన టోన్డ్ ఫిజిక్  ని ఎలివేట్ చేసే ఫోటోలను షేర్ చేస్తోంది.

తాజాగా టైట్ ఇన్నర్స్ ధరించి ఇదిగో ఇలా ఫోజిచ్చింది. ఇక బాటమ్ లో టైట్ ట్రాక్ ని ధరించింది. ప్రస్తుతం యూత్ లో ఇది వైరల్ గా మారింది. పూజా స్టన్నింగ్ మేకోవర్ ఫిజిక్ పై బోయ్స్ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఐదు రిలీజ్ లతో ..!

పూజా హెగ్డే 2022లో ఐదు విడుదలలను కలిగి ఉంది. ప్రభాస్ సరసన రాధేశ్యామ్.. విజయ్  సరసన బీస్ట్.. రణవీర్ సింగ్ సరసన సర్కస్.. చిరంజీవి- రామ్ చరణ్‌లతో ఆచార్య ఇవన్నీ ఈ ఏడాదిలోనే రిలీజవుతున్నాయి. వీటిలో కొన్ని నెల గ్యాప్ తోనే రానున్నాయి. మహేష్ బాబు సరసన ఇంకా పేరు పెట్టని చిత్రంలోనూ నటించనుంది.

గత సంవత్సరం వరుస చిత్రాలతో స్ఫూర్తినింపిన పూజా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` తో అఖిల్ కి హిట్టిచ్చింది. 2022 లో తన హీరోలందరికీ లక్కీ ఛామ్ గా మారుతోంది. 2022 నాటికి నేను ప్రేక్షకులు  గుర్తుంచుకునే సినిమాల్ని  అందించాలని నిశ్చయించుకున్నాను. నేను నా పనిలో కొత్తదనాన్ని అందించాలనుకుంటున్నాను. ప్రేక్షకులు దర్శకనిర్మాతలు నన్ను ఉత్తేజపరుస్తారని భావిస్తున్నాను`` అని తెలిపారు.