'పిశాచి 2' ఫస్ట్ లుక్: నగ్నంగా బాత్ టబ్ లో సిగరెట్ తాగుతూ..!

Tue Aug 03 2021 23:00:02 GMT+0530 (IST)

pisachi 2 first look

తమిళ దర్శకుడు మిష్కిన్ తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ సినిమా 'పిశాసు'. నాగ - ప్రయాగ మార్టిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో 'పిశాచి' పేరుతో 2015లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ చిత్రానికి స్సీక్వెల్ గా ''పిశాసు 2'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు మిష్కిన్.'పిశాచి 2' చిత్రంలో ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. 'విశ్వరూపం' 'తడాఖా' 'తారామణి' 'గృహం' 'మాస్టర్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆండ్రియా.. ఇంతకుముందు మిస్కిన్ తెరకెక్కించిన 'డిటెక్టివ్' మూవీలో నటించింది. తాజాగా ''పిశాసు 2'' ఫస్ట్ లుక్ పోస్టర్ ని డైరెక్టర్ వెట్రి మారన్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ ని విషెస్ అందించారు.

'పిశాసు 2' ఫస్ట్ లుక్ లో బాత్ టబ్ లో పడుకొని ఉన్న ఓ యువతి సిగరెట్ తాగుతూ బయట కాళ్లు వేలాడేసి కనిపిస్తోంది. ఇందులో ఆమె ఫేస్ రివీల్ చేయనప్పటికీ.. టబ్ లో నగ్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఆండ్రియా జెరెమియా ఈ చిత్రం కోసం న్యూడ్ గా కనిపించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే 'పిశాసు 2' చిత్రం నుంచి విడుదలైన ఆండ్రియా లుక్ విశేష స్పందన తెచ్చుకుంది. బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ లో కనిపించిన ఆండ్రియా లుక్ ని.. ఆమె తాతమ్మ ఫోటో స్ఫూర్తితో డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ లో మాత్రం ఎవరి ముఖాలు చూపించలేదు మిస్కిన్. అయితే 2021 లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే సీక్వెల్ అని చెబుతున్నా కథ పరంగా ఫస్ట్ పార్ట్ కి దీనికి సంబంధం ఉందని అంటున్నారు. 'పిశాసు 2' చిత్రంలో పూర్ణ - సంతోష్ ప్రతాప్ - అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి మరియు 'సైకో' ఫేమ్ రాజ్ కుమార్ పిచ్చుమణి అతిథి పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది.

'పిశాచి 2' పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకి కార్తీక్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. రాక్ ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై టి.మురుగనందం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే 'పిసాసు 2' నుండి ఓ సాంగ్ విడుదల చేయనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.