Begin typing your search above and press return to search.

పిక్ టాక్: బావ తాకితే సత్యభామకు సమ్మతమే..!

By:  Tupaki Desk   |   17 May 2022 8:31 AM GMT
పిక్ టాక్: బావ తాకితే సత్యభామకు సమ్మతమే..!
X
ఇటీవల 'సెబాస్టియన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన యువ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు ''సమ్మతమే'' అనే చిత్రంతో రాబోతున్నాడు. ఇందులో 'కలర్ ఫోటో' ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

'సమ్మతమే' సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు మరియు 'కృష్ణ & సత్యభామ' 'బుల్లెట్ లా' వంటి రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

'బావ తాకితే' అనే యూనిక్ స్టైల్ రెట్రో సాంగ్ లిరికల్ వీడియోని మే 21న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఇందులో చాందిని చౌదరీ సిగ్గు పడుతూ ఊయలలో కూర్చొని ఉండగా.. కిరణ్ అబ్బవరం వెనుక నిలబడి నవ్వుతూ ఆమె వైపే తీక్షణంగా చూస్తున్నాడు. ఇద్దరూ రెట్రో లుక్ లో ఆకట్టుకుంటున్నారు. మరి 'బావ తాకితే' పాట ఆడియన్స్ ను ఎలా అలరిస్తుందో చూడాలి.

మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న 'సమ్మతమే' చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. విప్లవ్ నిషాదం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

'సమ్మతమే' చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. 2022 జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇంతకముందు 'రాజావారు రాణిగారు' 'SR కళ్యాణమండపం' సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ రెండు విజయాలను అందుకున్న కిరణ్ అబ్బావరం.. ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.