అవసరాల PaPa.. దెబ్బెసేలా ఉందే!

Sat Mar 18 2023 15:05:52 GMT+0530 (India Standard Time)

phalana abbayi phalana ammayi movie news

ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. నాగశౌర్య హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా రూపొందింది. ఇక ఈ సినిమాలో అవసరాల శ్రీనివాసరావు మేఘ చౌదరి అశోక్ కుమార్ అభిషేక్ మహర్షి శ్రీవిద్య వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. టీజీ విశ్వప్రసాద్ పద్మజా దాసరి నిర్మాతలుగా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు.గతంలో అవసరాలు శ్రీనివాస దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమాలన్ని రొమాంటిక్ సినిమాలుగా సూపర్ హిట్ లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద కూడా సినీ అభిమానులందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆమేరా ఈ సినిమా లేదని వాదన వినిపిస్తోంది. ఆయన గత సినిమాల ధోరణిలోనే ఈ సినిమా కూడా సాగుతుందని పెద్దగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని తెలుస్తోంది.

ఇక మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే దాదాపుగా 85 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసిందని అంటున్నారు. చాలా చోట్ల కలెక్షన్లు భారీగా దెబ్బ వేశాయని అంటున్నారు. అమెరికాలో కూడా చాలా తక్కువ అరేంజ్ లోనే కలెక్షన్స్ వచ్చాయని మొదటి రోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా కోటి పది లక్షల గ్రాస్ రేంజ్ లో వచ్చాయని అంటున్నారు. ఈ సినిమాకి మూడు కోట్ల 20 లక్షల దాకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో మూడున్నర నుంచి ఆ పైన వసూలు చేస్తే మాత్రమే హిట్ గా నిలుస్తుంది.

కచ్చితంగా ఈ సినిమా భారీ వసూళ్లు రాబడితే తప్ప కలెక్షన్స్ విషయంలో కోలుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు. వాస్తవానికి ఈ సినిమాతో పోటీగా రిలీజ్ అయిన కబ్జా సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కేజీఎఫ్ సినిమాకి పూర్తి కాపీగా ఉందని దానిమీద అభియోగాలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ప్రేక్షకులు కొంత అట్రాక్ట్ అయితే సినిమా నష్టాలతో కాకుండా సేఫ్ జోన్ లో పడి థియేటర్ బిజినెస్ క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.