Begin typing your search above and press return to search.

అర్జున్‌ రెడ్డి లాంటి మూవీలో ఈమెకు నటించాలనుందట

By:  Tupaki Desk   |   8 July 2020 8:10 AM
అర్జున్‌ రెడ్డి లాంటి మూవీలో ఈమెకు నటించాలనుందట
X
ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో హీరోయిన్‌ గా ప్రేక్షకులకు పరిచయం అయిన పాయల్‌ రాజ్‌ పూత్‌ మొదటి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. అతి తక్కువ సమయంలోనే ఈమె క్రేజ్‌ పడిపోయింది. ప్రస్తుతం ఒక లేడీ ఓరియంటెడ్‌ చిత్రం చేయడంతో పాటు వెబ్‌ సిరీస్‌ ల వైపు అడుగులు వేస్తుంది. ఇలాంటి సమయంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది.

ఈ ఇంటర్వ్యూలో తనకు అర్జున్‌ రెడ్డి వంటి సినిమాలో నటించాలని ఉందని చెప్పింది. సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా పేర్కొంది. అలాగే ప్రభాస్‌ ఇంకా విజయ్‌ దేవరకొండలతో రొమాంటిక్‌ సీన్స్‌ చేయాలనేది తన డ్రీమ్‌ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు స్టార్‌ హీరోలతో పాటు అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించాలనుకోవడం మరీ అత్యాస అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

పాయల్‌ డ్రీమ్స్‌ సాధ్యం అయ్యేవి కావని ఖచ్చితంగా ఆమెకు కోరుకున్న ఆపర్లు రాకపోవచ్చు అంటూ నెటిజన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. ఆమె అభిమానులు మీ డ్రీమ్స్‌ సాకారం కావాలని కోరుకుంటున్నాం మేడం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి విజయ్‌ దేవరకొండ.. ప్రభాస్‌ తో నటించాలని ఉంది.. అర్జున్‌ రెడ్డి వంటి సినిమాలో నటించాలనుకుంటున్నాను అంటూ పాయల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.