ఉగాదికి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గిఫ్ట్..

Fri Mar 17 2023 05:00:01 GMT+0530 (India Standard Time)

pawan kalyan Vinodaya Sitham remake trailer release ugadi festival

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా  కొద్దిరోజుల్లో పూర్తి చేయనున్నారు. అయితే ఆ సినిమా పూర్తి కాకుండా మరో 3 సినిమాలు లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తమిళ సినిమా వినోదయ సీతం రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ని ఉగాది కానుకగా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ ఉగాదికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని టాక్.సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. దీని గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. పవన్ సాయి తేజ్ ఇద్దరు కలిసి చేస్తున్న మొదటి సినిమా అవడంతో ఈ రీమేక్ పై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సుజిత్ డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నారు. పవన్ ఈ ఏడాది ఒక సినిమా రిలీజ్.. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి.. సమ్మర్ కి వరుస రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నారు.

వినోదయ సీతం సినిమా రీమేక్ కు మాత్రం పవన్ కేవలం 22 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆలోగా తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. వినోదయ సీతం రీమేక్ కి త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నారు. పవన్ రీమేక్ సినిమాల విషయంలో త్రివిక్రం హ్యాండ్ భారీగా ఉంటుందని తెలిసిందే. వినోదయ సీతం రీమేక్ కి కూడా త్రివిక్రం తన ఫుల్ సపోర్ట్ అందిస్తున్నారని టాక్. ఇందుకు గాను త్రివిక్రమ్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.

ఓ పక్క మహేష్ సినిమాను డైరెక్ట్ చేస్తూనే పవన్ సినిమాకు డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు త్రివిక్రమ్. అయితే మహేష్ సినిమా మీద పెట్టాల్సిన ఫోకస్ అంతా పవన్ సినిమాపై పెడుతున్నారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. పవన్ మహేష్ సినిమాలతో త్రివిక్రమ్ మరోసారి తన పెన్ పవర్ ఏంటో చూపించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.