Begin typing your search above and press return to search.

13 ఏళ్ళ క్రితమే పవన్ కళ్యాణ్ పాన్ వరల్డ్ మూవీ

By:  Tupaki Desk   |   28 March 2023 5:00 AM GMT
13 ఏళ్ళ క్రితమే పవన్ కళ్యాణ్ పాన్ వరల్డ్ మూవీ
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ లో ఒక్కడిగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలున్నాయి.తాజాగా సముద్రఖని దర్శకత్వంలో వినోదాల సీతమ్ సినిమా రీమేక్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఏప్రిల్ 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతూ ఉంది. కోలీవుడ్‌ హిట్ మూవీ తెరికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ నుంచి అత్యధికంగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతూ ఉన్నాయి. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఖాతాలతో పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అయితే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలను పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు.

అయితే 13 ఏళ్ల క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా పాన్ వరల్డ్ మూవీ కమిట్ అయ్యారు అనే విషయం చాలామందికి తెలీదు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యేసు క్రీస్తు జీవిత కథ ఆధారంగా ఆ సినిమా హాలీవుడ్ తో పాటు ఇండియన్ భాషలలో తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు.

కొండా కృష్ణం రాజు నిర్మాతగా ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. హాలీవుడ్ లో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యాకప్ అరిస్ట్ క్రిస్టిన్ టిన్స్ లేని ఈ మూవీ కోసం ఎంపిక చేశారు. అమితాబచ్చన్ పా మూవీకి కూడా ఇతను మ్యాకప్ ఆర్టిస్ట్ గా పనిచేసి జాతీయ అవార్డు అందుకున్నారు.

బాలలతో తెరకెక్కించే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్ర చేస్తాడు అనేది రివీల్ చేయలేదు. కాని సినిమాని గ్రాండ్ గా ప్రారంభించాలని అనుకున్నారు. అయితే తరువాత ఎందుకనో ఈ మూవీ పట్టాలు ఎక్కలేదు. అలా మొదటి సారిగా ఇండియా నుంచి పాన్ వరల్డ్ సినిమా ఛాన్స్ ఛాన్స్ ని పవన్ కళ్యాణ్ కోల్పోయారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి తెరపైకి రావడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.