Begin typing your search above and press return to search.

పఠాన్ ఒరిజినల్ కలెక్షన్స్ పై ఎంతంటే?

By:  Tupaki Desk   |   5 Feb 2023 12:00 PM GMT
పఠాన్ ఒరిజినల్ కలెక్షన్స్ పై ఎంతంటే?
X
షారుఖ్ ఖాన్ హీరోగా సిద్దర్ద్ ఆనంద్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం పఠాన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 729 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రెగ్యులర్ గా ఈ సినిమా కలెక్షన్స్ పై బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుందని చెబుతున్నారు. అలాగే బాలీవుడ్ మీడియా మొత్తం పఠాన్ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తుంది.

ఇక కేజీఎఫ్ చాప్టర్ 2, బాహుబలి సినిమాల ఫస్ట్ వీక్ రికార్డులని ఈ మూవీ బ్రేక్ చేసింది అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఒక వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేక ప్రచారం జరిగిన కూడా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా డ్రాప్ కాలేదు. ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. దీంతో షారుఖ్ ఖాన్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ చేసిన చిత్రంగా పఠాన్ నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ అన్ని ఫేక్ అని షారుఖ్ ఖాన్ వ్యతిరేకులు అందరూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది.

ఈ నేపధ్యంలో ట్విట్టర్ లో వ్యక్తి షారుఖ్ ని ట్యాగ్ చేస్తూ పఠాన్ ఒరిజినల్ కలెక్షన్స్ ఏంటి అనేది క్లారిటీ ఇవ్వండి అంటూ కామెంట్స్ చేశాడు. అయితే దీనిపై షారుఖ్ ఖాన్ అతనికి అదిరిపోయే రేంజ్ లో కౌంటర్ ఇవ్వడం విశేషం. అతనిని విమర్శించకుండా సంస్కారంగానే అతని కామెంట్స్ కి షారుఖ్ ఖాన్ తిరిగి రిప్లై ఇచ్చారు.

ఈ సినిమా కలెక్షన్స్ ఒరిజినల్ గా పఠాన్ కలెక్షన్స్ కంటే ఎక్కువ అని చెప్పిన షారుఖ్ 5000 కోట్ల మంది ప్రేమ, 3000 కోట్ల మంది ప్రశంసలు, 3250 కోట్ల మంది కౌగిలింతలు. 2 బిలియన్స్ మంది స్మిల్స్ ఈ సినిమాకి కలెక్షన్స్ రూపంలో వచ్చాయి అంటూ రిప్లై ఇచ్చారు. ఇవన్ని నా అకౌంట్ లోకి వచ్చి కలెక్షన్స్ అంటూ షారుఖ్ ఖాన్ పోస్ట్ చెప్పడం విశేషం. ఇక ఈ పోస్ట్ పై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మెజారిటీ ప్రజలు చాలా అద్బుతంగా సమాధానం చెప్పారని కామెంట్స్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.