జక్కన్న పై జూనియర్ అస్ర్తం..ప్రశాంత్ ప్లానింగ్ పీక్స్ లో!

Thu Jul 07 2022 22:00:01 GMT+0530 (IST)

panindia directors prashanth neel on SS Rajamouli

పాన్ ఇండియా దర్శకులు రాజమౌళి..ప్రశాంత్ నీల్ మధ్య నెలకొన్న పోటీ గురించి చెప్పాల్సిన పనిలేదు.  ఇద్దరి మధ్య  నువ్వా?  నేనా? అన్న తీరున పోటీ వాతావరణం పెరుగుతోంది. `బాహుబలి` ప్రాంచైజీ..`ఆర్ ఆర్ ఆర్` తో జక్కన్న పాన్ ఇండియా మేకర్ అయితే..`కేజీఎఫ్` ప్రాంచైజీతో ప్రశాంత్ నీల్ రేసులోకి వచ్చారు. ఇద్దరు దర్శకుల సినిమాలకు ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా విపరీతమైన పోటీ ఉంది.`కేజీఎఫ్ -2` బ్లాక్ బస్టర్ తో `ఆర్ ఆర్ ఆర్` వసూళ్లు క్రాక్ అయ్యాయి. కానీ గ్లోబల్ స్థాయిలో రెండు సినిమాల మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. విదేశీ ప్రేక్షకుల్ని అలరించిన చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ అరుదైన రికార్డు సాధించింద. కానీ కేజీఎఫ్ కి అలాంటి ఖ్యాతి దక్కలేదు. మొదటి భాగం సహా రెండు భాగాలు ఇండియా వైడ్ మాత్రమే ఫేమస్ అయ్యాయి.

కానీ జక్కన్న బాహుబలి..ఆర్ ఆర్ ఆర్ రెండు సినిమాలతో పాన్ వరల్డ్ లో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడా హైట్స్ ని ప్రశాంత్ నీల్  సైతం అందుకోవాలని తహతహలాడుతున్నాడు. గ్లోబల్ పీస్ తో రాజమౌళిని రికార్డులన్నింటిని బీట్ చేయాలని కసి మీదున్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే అస్ర్తంగా మలుస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

`సలార్` తర్వాత ప్రశాంత్ టైగర్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్ర్కిప్ట్ లాక్ అయింది. సలార్ రిలీజ్ అనంతరం టైగర్ ని సీన్ లోకీ తీసుకురానున్నారు. జూనియర్ తో ప్రశాంత్ చేయబోయే సినిమా జక్కన్న రికార్డులన్నింటిని తునాతునకలు చేసేలా ఉంటుందని తెరపైకి వస్తుంది. యంగ్ టైగర్ యాక్టింగ్ ట్యాలెంట్ తోనే దాన్ని సాధిండచం సాధ్యమవుతుందని..అందుకే అతన్నే అస్ర్తంగా మలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాలి. యంగ్ టైగర్-రాజమౌళి మంచి స్నేమితులు. భారతీయ నటుల్లో జక్కన్న అభిమానంచే ఏకైక నటుడు తారక్.

జూనియర్ జక్కన్నని ఓ గురువుగాను భావిస్తాడు. ఇద్దరిది టాలీవుడ్ గురు-శిష్యుల బంధంగా భావిస్తుంది. సరిగ్గా ప్రశాంత్ నీల్ ఇదే పాయింట్ పట్టుకుని శిష్యుడి ని ఆధారంగా చేసు కుని గురువు మీదకు శమరశంఖం పూరిస్తున్నట్లు కనిపిస్తుంది.

మరి ప్రభాస్న `సలార్` తో ప్రశాంత్ ఎటాకింగ్ దిగొచ్చు కదా? అని సందేహం రాక మానదు. కానీ యాక్టింగ్ పరంగా ప్రభాస్-తారక్ మధ్య చాలా వ్యత్యాసం  ఉంటుంది. ఎలాంటి పాత్రనైనా తారక్ అవలీలగా పోషించగలడు. కటౌట్ అన్ని చోట్లా పనవ్వదు. బాక్సాఫీస్ వద్ద అద్బుతాలు చోటు చేసుకోవాలంటే యాక్టింగ్ మాత్రమే భూమిక పోషిస్తుంది.  ప్రశాంత్ ఇప్పుడు అదే అస్ర్తాన్ని వదలబోతున్నాడు అన్నది సుస్పష్టం.