Begin typing your search above and press return to search.

జానూలో సమంత మొత్తం మూడు డ్రెస్సుల్లోనే..!

By:  Tupaki Desk   |   9 Feb 2020 2:30 AM GMT
జానూలో సమంత మొత్తం మూడు డ్రెస్సుల్లోనే..!
X
సినిమా ఏదైనా కావొచ్చు. అందులోకి అగ్ర కథానాయికి నటించే సినిమా అంటే.. అందులో రిచ్ క్యాస్టూమ్స్ తప్పనిసరి. అలాంటిది.. అందుకు భిన్నంగా సింఫుల్ క్యాస్టూమ్స్ తో సినిమా మొత్తాన్ని లాగించే పాత్రలు తెలుగులో తక్కువనే చెప్పాలి. సమంత.. శర్వానంద్ తాజాగా నటించిన జానూ చిత్రం కొత్తగా అనిపించటమే కాదు.. సినిమా మొత్తం లో సమంత కేవలం మూడంటే మూడు డ్రెస్సుల్లోనే కనిపించటం విశేషం.

ఆ మాటకు వస్తే.. 151 నిమిషాల నిడివి ఉన్న జానూలో పాత్రలు కొన్ని ఉన్నా.. సినిమా మొత్తం కనిపించేది సమంత.. శర్వా పాత్రలే. పదో తరగతి.. డిగ్రీలకు సంబంధించిన ఎపిసోడ్ లో హీరో హీరోయిన్ల పాత్రలకు వేరే నటులతో చేయించటంతో.. సినిమా మొత్తంలో శర్వా.. సమంతల సన్నివేశాలు కాస్త తక్కువగా ఉంటాయి. ఆ మాటకు వస్తే.. సమంత ఎంట్రీ ఇంటర్వెల్ కు కాస్త ముందుగానే వస్తుంది.

కాకుంటే.. ఆ తర్వాత శర్వా.. సమంత లే స్క్రీన్ మీద నిండుగా కనిపిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సినిమా మొత్తంలో సమంత కేవలం మూడంటే మూడు క్యాస్టూమ్స్ లో మాత్రమే దర్శనమివ్వటం ఒక ఎత్తు అయితే.. అందులో ఒక డ్రెస్సులోనే సినిమాలో అత్యధిక భాగం నటించటం మరో ఎత్తు. ఇటీవల కాలం లో ఒక అగ్రనటి చేసిన పాత్ర లో ఇంత తక్కువ.. సింఫుల్ క్యాస్టూమ్స్ ను వాడింది లేదు. అందుకు సమంతను ప్రత్యేకంగా అభినందించాల్సిందే.