బాలీవుడ్ భామతో ఎన్టీఆర్.. పాన్ ఇండియా యాడ్!

Mon Mar 20 2023 21:48:28 GMT+0530 (India Standard Time)

ntr appy fizz ad with kriti sanon

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూడాలని చిత్రంతో 2001లో సినీ రంగంలో అడుగు పెట్టిన అతడు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. కేవలం సినిమాల్లోనే కాకుండా అనేక యాడ్స్ లో కూడా నటిస్తూ.. మెప్పిస్తుంటాడు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆపీ ఫిజ్ దక్షిణాది రాష్ట్రాల అంబాసిడర్ గా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే ఆయన బాలీవుడ్ బ్యూటీ క-తి సనన్ తో కలిసి ఆపీ ఫిజ్ యాడ్ లో నటించి మెప్పించారు. ఇందుకు సంబంధించిన యాడ్ ను ఎన్టీఆర్ తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మొత్తం ఆరు భాషల్లో ఈ యాడ్ ను తెరకెక్కించగా.. ఈ వీడియోలన్నింటిని యంగ్ టైగర్ తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళ కన్నడ ఉర్దూలో ఈ యాడ్ ను తెరకెక్కించారు.

అయితే ఇందులో.. కృతి సనన్.. చూడు ఇంకొక్క కొత్త రోజు. ఈరోజు నువ్వు కూడా ఏదైనా కొత్తగా చేసెయ్ అంటూ చెప్పగా.. జూనియర్ ఎన్టీఆర్ అందరిలా నిన్ను మారమంటున్న ఈ లోకం. ఏదీ వినొద్దు ఏదీ అనొద్దు అని చెప్పాడు.ఆ తర్వాత కృతి.. నువ్వు అందరిలా కాదు నీలా ఎవరూ లేరు అని చెప్పగా ఎన్టీఆర్ నువ్వేంటన్నది అందరికీ చూపించు. నీ ఉత్సాహం కొత్తది. రంగు రూపులు కొత్తదని వివరించాడు. ఆ తర్వాత కృతి యంగ్ టైగర్ ఇద్దరూ కలిసి.. నీ హుషారైన రంగులు ఏమంటున్నాయో విను.. ఇవాళ కొత్తదేదైనా చేసి చూపించు... ఆన్ న్యూ ఆపీ ఫిజ్ అంటూ తెలిపారు.

ఎన్టీఆర్ ఈ యాడ్ ను షేర్ చేసిన గంటలోపే లక్షన్నర లైకులు 17 వందలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఒక్క ఇన్ స్టా వేధికగానే జూనియర్ ఎన్టీఆర్ కు 5.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ 89 పోస్టులను షేర్ చేశాడు. ఇందులో పర్సనల్ లైఫ్ కంటే కూడా ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పోస్టులే ఎక్కువ. ఆపీ ఫిజ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న యంగ్ టైగర్ వల్ల దేశంలో నెంబర్ వన్ కంపెనీగా మారుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కంపెనీ వాళ్లు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.