Begin typing your search above and press return to search.
'విక్రమ్' డైరెక్టర్ ని పట్టించుకోని ఆ ఆరుగురు ఎవరు?
By: Tupaki Desk | 28 Jan 2023 3:00 PMకమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత నటించిన మూవీ `విక్రమ్`. లోకేష్ కనగరాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ గత కొంత కాలంగా సరైన సక్సెస్ తో పాటు నిర్మాతగానూ భారీ నష్టాల్లో వున్న కమల్ హాసన్ కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఆయనకు భారీ లాభాల్ని అందించింది. ఈ మూవీతో లోకేష్ కనగరాజ్ టాలీవుడ్ లోనూ హాట్ ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయారు. `విక్రమ్` రిలీజ్ తరువాత చాలా మంది తెలుగు స్టార్‌హీరోలు విక్రమ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించి డిన్నర్ కూడా ఇచ్చారని టాక్.
ఇక తమ సినిమాల్లో `విక్రమ్` తరహా బ్యాగ్రైండ్ స్కోర్ వుండాలని డిమాండ్ చేస్తున్న స్టార్ హీరోలు కూడా టాలీవుడ్ లో చాలా ఎక్కువ మందే వున్నారని, సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంటి హీరోలు సైతం తెలిసిప మ్యూజిక్ డైరెక్టర్ లతో అనడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయాలని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వినిపించడం తెలిసిందే. ఇదిలా వుంటే తెలుగులో స్టార్ హీరోలని మెప్పించిన లోకేష్ కనగరాజ్ ని ఆరుగురు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ రిజెక్ట్ చేశారట.
తనతో సినిమా అంటే `విక్రమ్` కు ముందు పెద్దగా పట్టించుకోలేదట. ఈ విషయాన్ని యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించినట్టుగా తెలిసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ `మానగరం` మూవీని చేశాడు. ఇదే మూవీని తెలుగులోనూ విడుదల చేశారు. రెండు భాషల్లోనూ ఈ మూవీ మంచి హిట్ అనిపించుకుంది. ఇదే సమయంలో లోకేష్ కనగరాజ్ టాలెంట్ గురించి తెలిసి టాలీవుడ్ లో ఆరుగురు ప్రొడ్యూసర్ ల వద్దకు సందీప్‌కిషన్ తీసుకెళ్లాడట.
సందీప్ తీసుకెళ్లిన ప్రతీ నిర్మాత లోకేష్ కనగరాజ్ ని పట్టించుకోలేదట. తన ఈ స్థాయి డైరెక్టర్ అవుతాడని వారు పెద్దగా ఆసక్తిని చూపించలేదట. ఆరుగురురికి ఆరుగురు టాలీవుడ్ ప్రొడ్యూసర్ లు లోకేష్ కనగరాజ్ ని రిజెక్ట్ చేయడంతో తను తమిళ్ లో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడని, ఖైదీ`తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత విజయ్ తో `మాస్టర్`, కమల్ తో `విక్రమ్` సినిమాలు చేయడంతో లోకేష్ కనగరాజ్ పేరు టాలీవుడ్ లోనూ మారుమోగింది.
ఇదిలా వుంటే సందీప్ కిషన్ ప్రస్తుతం `మైఖేల్` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సందీప్ కిషన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే సందీప్ కిషన్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.