Begin typing your search above and press return to search.

VNRTrio: భీష్మ కాంబినేషన్.. ఇది నెవ్వర్ బిఫోర్ అప్డేట్!

By:  Tupaki Desk   |   22 March 2023 11:15 PM
VNRTrio: భీష్మ కాంబినేషన్.. ఇది నెవ్వర్ బిఫోర్ అప్డేట్!
X
యంగ్ అండ్ డైనమిక్ హీరో నితిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన భీష్మ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కాంబోలో తాజాగా మరో సినిమా వస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇందులోనూ హీరో హీరోయిన్లుగా రష్మికా మందన్నా, నితిన్ ను తీసుకుంటుండగా... వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం.

VNR trio ట్యాగ్ తో ఎనౌన్స్ చేసిన విధానం చాలా బాగుంది. సినిమాలను సరికొత్త తరహాలో ప్రమోట్ చేస్తున్న తరుణంలో వీరు ఊహించని విధంగా నెవ్వర్ బిఫోర్ అనేలా చెప్పారు. ఇక వారు ఎనౌన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో ఎవరికి వాళ్లు సెల్ఫ్ సెటైర్లు గట్టిగానే వేసుకున్నారు. ఇందులో ముందు నితిన్ వస్తాడు. అక్కడే ఉన్న అసిస్టెంట్ ను ఇంకా ఎవరూ రాలేదా అని అడగ్గా.. హీరోయిన్ 8 గంటలకే వచ్చేసిందనే ఆన్సర్ వస్తుంది. ఇంతలోనే అక్కడకు రష్మిక రాగా.. మళ్లీ సేమ్ హీరోయిన్ హా అంటాడు. డౌటా అని క్రష్మిక అడగ్గా... అస్సలు లేదమ్మా మన డైరెక్టర్ స్క్రిప్టులో ఓం రాసే ముందు నీ పేరే రాసుకుంటాడని నాకు తెలుసంటూ కామెంట్ చేస్తాడు. ఇప్పటి వరకు ఏం చేశావని అడగ్గా లైవ్ ఇచ్చానని రష్మిక అంటుంది.. లైవ్ యేనా కాంట్రవర్సీలు ఏమైనా అని నితిన్ అడగబోతాడు.

దీనికి రష్మిక.. నేను ఒక్క మాట మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్సీలు అవుతున్నాయి అని అంటుంది. ఇందుకు నితిన్ అది చాలా బెటర్.. నేను ఒక్క హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాప్ లు అవుతున్నాయని తనపై తానే సెటైర్ వేసుకుంటాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఎంట్రీ ఇస్తాడు. ఆయన తమిళంలో హీరోగా నటిస్తుండగా.. ఈ సినిమాకు మేకప్ వేసుకోవడం లేదని.. కేవలం మ్యూజిక్ ఇస్తే చాలంటూ నితిన్ సెటైర్ వేశారు. అయితే డైరెక్టర్ ఏంటీ ఇంకా రాలేదా అని జీవీ ప్రకాష్ ప్రశ్నించగా.. ఆయన భీష్మ సినిమా విడుదలైన మూడేళ్లకు ఈ సినిమా మొదలవుతుంది.. ఇంతకంటే లేటా అంటూ నితిన్ కామెంట్ చేస్తాడు.

ఆ తర్వాత వచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుముల సినిమా సమ్మరినీ వాళ్లకు చెప్పగా.. చాలా బాగుందంటారు. మరి టైటిల్ ఏం పెట్టారని ప్రశ్నించగా దర్శకుడు నోరెళ్లబెడతాడు. ఇక్కడితో ఈ వీడియో పూర్తవుతుంది. అయితే ఈ వీడియోలు ముందుగానే తాము ఎవరి మనోభావాలు దెబ్బ తీయడం లేదని.. తమ మనోభావాలు తామే దెబ్బ తీసుకుంటున్నామని వీడియో స్టార్టింగ్ లోనే నితిన్, రష్మికలు చెప్పడం విశేషం.