విడుదలకు సిద్ధం అవుతున్న పాన్ ఇండియన్ మూవీ!

Tue May 26 2020 22:34:50 GMT+0530 (IST)

nishabdham Movie Censor Talk

లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా విడుదల కావల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో ఆగష్టు వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటిటి లకు బాగా అలవాటు పడ్డారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి సంస్థలు మీడియం రేంజ్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను కొనుక్కొని థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేయాలని నిర్మాతల వెంటపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా చేరింది. ఇటీవలే ఈ సినిమా డైరెక్ట్ గా విడుదల కానుందని వార్తలు వచ్చాయి.. అయితే ఆ వార్తలు నిజం కాదని నిర్మాతలు కొట్టిపారేశారు. ఎందుకంటే ఈ సినిమా మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది.ఈ విషయాన్ని దర్శక నిర్మాత హేమంత్ మధుకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘‘మా రెండు సినిమాలు ‘నిశ్శబ్దం’ తెలుగు ‘సైలెన్స్’లకు యు/ఎ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ బోర్డు సభ్యులు స్పందన చూసి నాకెంతో ఆనందం వేసింది. ఈ సినిమాను థియేటర్‌లోనే ఫస్ట్ విడుదల చేయాలని వారు ఇచ్చిన సలహాకు నా కృతజ్ఞతలు’’ అని మధుకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్కతో పాటు మాధవన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక అంజలి షాలిని పాండే సుబ్బరాజు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రలు పోషించారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను కోన వెంకట్ టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళ హిందీతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ కానుంది. ఇక నిశ్శబ్దం థియేటర్ల సైలెన్స్ ని బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతుందని సమాచారం.

TAGS: Anushka