Begin typing your search above and press return to search.

యంగ్ హీరోలో ఏదో సూప‌ర్ ప‌వ‌ర్!

By:  Tupaki Desk   |   4 Dec 2019 4:57 AM GMT
యంగ్ హీరోలో ఏదో సూప‌ర్ ప‌వ‌ర్!
X
కొంద‌రు ఏం ప‌ట్టినా బంగార‌మే. కొంద‌రు ఏది ట‌చ్ చేసినా బూడిదే. ప‌ట్టింద‌ల్లా బంగారంగా మారితే దానిని మిడాస్ ట‌చ్ అంటారు. మ‌రి ఆ యంగ్ హీరో ఎన్ని స్ట్ర‌గుల్స్ లో ఉన్నా కానీ అత‌డు ప‌ట్టిందల్లా బంగారంగానే మారుతోంది! అత‌డి ట‌చ్ వెన‌క ఏదైనా ఊహాతీత‌ శ‌క్తి ఉందా? పాజిటివిటీని పెంచే మంత్ర శ‌క్తి ఉందా? అన్న ముచ్చ‌ట వేడెక్కిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా హీరో అంటే.. ఇంకెవ‌రు నిఖిల్.

`హ్యాపీడేస్` సినిమాలో కాలేజ్ బ్యాచ్ లో ఒక‌డిగా క‌నిపించిన‌ నిఖిల్ పాత్ర ప్రాధాన్య‌త ఎంతో తెలిసిందే. ఆ త‌ర్వాత వ‌రుణ్ సందేశ్ పెద్ద స్టార్ అయితే ఇత‌ర హీరోలెవ‌రూ వెంట‌నే స్టార్లు కాలేక‌పోయారు. అయితే ఒక్కో మెట్టు నిర్మించుకుంటూ యంగ్ హీరో నిఖిల్ ఎదిగిన తీరు మాత్రం అస‌మానం అనే చెప్పాలి. అత‌డిని ఏదో సూప‌ర్ ప‌వ‌ర్ ఇంత దూరం న‌డిపించింది. నెప్టోయిజం ప్ర‌పంచంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా త‌న‌కంటూ ఒక స్థాయి ఉంద‌ని నిరూపించుకోగ‌లిగాడు అత‌డు. అయితే అంద‌రిలానే ఊహించ‌ని స్ట్ర‌గుల్ త‌నకు ఎప్పుడూ ఉంది. ప్ర‌తి సినిమాకి త‌ను ఏదో ఒక ఇబ్బందికి గురి కావాల్సి వ‌స్తోంది. అది నిర్మాత‌ల లోప‌మా? లేక ప్లానింగ్ ప్రాబ్ల‌మా? అన్న‌ది మాత్రం ఎవ్వ‌రికీ అర్థం కాదు. స్ట్ర‌గుల్ ఎదుర్కొన్న‌ ప్ర‌తిసారి హిట్ సినిమాతో మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి వ‌స్తున్నాడు. `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` టైమ్ లో డీమానిటైజేష‌న్ కార‌ణంగా చాలా ఇబ్బందులే ఎదుర‌య్యాయి. అన్ని అడ్డంకుల్ని అధిగ‌మించి నోట్ల ర‌ద్దు స‌మ‌యంలోనే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి.. మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

రీసెంట్‌గా మ‌ళ్లీ అదే స్ట్ర‌గుల్ ని `అర్జున్ సుర‌వ‌రం` ఫేస్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా రిలీజ్ వాయిదాప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. సోమ‌వారం మంచి వ‌సూళ్ల‌ని సాధించి పాజిటివిటీ పెంచింది. లాంగ్ ర‌న్ సాధించి మంచి హిట్ కొడుతుంద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఠాగూర్ మ‌ధుకు ఇటీవ‌ల భారీ చిత్రాలే పెద్ద జోల్ట్ ఇస్తే నిఖిల్ సినిమానే ఆదుకునేంత‌ హిట్ట‌వుతోంది అంటూ ముచ్చ‌ట సాగుతోంది. ఇదంతా నిఖిల్ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్రేష‌న్ అనే చెప్పాలి.

ఇక అర్జున్ సుర‌వ‌రం క‌లెక్ష‌న్స్ ని మ‌రింత పెంచాల‌ని హీరో నిఖిల్ ప్ర‌చారం ప‌రంగా థియేట‌ర్ల చుట్టూ తిరుగుతున్నాడు. క‌మిట్ మెంట్ తో ప‌బ్లిసిటీ చేసి ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న చాలా మంది సినీజ‌నం నిఖిల్ నిర్మాత‌ల హీరో.... అందుకే స్ట్ర‌గుల్స్ వున్నా నిర్మాత‌లు ఆయ‌న వెంట‌ప‌డుతున్నార‌ని పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే తాజాగా గీతా ఆర్ట్స్ 2- సుకుమార్ రైటింగ్స్ కాంబినేష‌న్ లో ఓ అదిరిపోయే ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ చిత్రానికి సుకుమార్ క‌థ‌- స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు. మాస్ట‌ర్ మైండ్స్ తో క‌లిసి ప‌ని చేసే జాక్ పాట్ కొట్టేశాడు నిఖిల్. వాస్త‌వానికి అర్జున్ సుర‌వ‌రం రిలీజ్ ముందు వ‌ర‌కూ నిఖిల్ లోని డైల‌మా గురించి తెలిసిందే. అత‌డు ఎలా కంబ్యాక్ అవుతాడు? అంటూ సందిగ్ధ‌త నెల‌కొంది. కానీ ఇప్ప‌టికిప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఓవైపు చందు మొండేటితో బ్లాక్ బ‌స్ట‌ర్ కార్తికేయ రీమేక్ .. మ‌రోవైపు అల్లు అర‌వింద్- సుకుమార్ ప్రాజెక్టు తో ఒక్క‌సారిగా థౌజండ్ వాలా ఎన‌ర్జీ తో కెరీర్ ని బూస్ట‌ప్ చేసుకుంటున్నాడు. ఇదంతా ఎలా సాధ్యం? అంటే ఒక హీరోలో పాజిటివ్ ఎన‌ర్జీ వ‌ల్ల‌నే సాధ్యం. త‌న చుట్టూ ఉండే శ‌క్తులు పాజిటివ్ శ‌క్తులు అయిన‌ప్పుడే ఇది పాజిబుల్. అందుకే నిఖిల్ చుట్టూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంద‌ని క‌న్ఫామ్ గా చెప్పొచ్చు. నిఖిల్ స‌హ‌చ‌ర హీరోల‌కు ఇదో లెస్స‌న్ లాంటిదే అంటే త‌ప్పేమీ కాదు.